Kamareddy: ప్రభుత్వ ఆస్పత్రిలో రోగిని ఎలుకలు కొరికిన ఘటన.. సర్కార్ సీరియస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamareddy: కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో రోగిని ఎలుకలు కొరికిన ఘటనపై సర్కార్ సీరియస్ అయ్యింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై వేటు వేసింది. ఐసీయూ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ వసంత్ కుమార్, కావ్య తో పాటు సర్సింగ్ ఆఫీసర్ మంజులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటనపై ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విచారణ ఆదేశించారు. దీంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.
Read also: Lover Kidnap: ఘట్కేసర్ లో కలకలం.. చెల్లిని ప్రేమించాడని యువకుడి కిడ్నాప్..
Also Read
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
కామారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగిని ఎలుకలు కొరికిన ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఓ రోగి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) లో చికిత్స పొందుతున్నాడు. రక్తపోటు సంబంధిత సమస్యలతో వారం రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీ, జనరల్ ఆస్పత్రిలో ఐసీయూలో ఉంచిన షేక్ ముజీబ్ కు చేతులు, కాళ్లపై ఎలుకలు తీవ్రంగా కొరికి గాయపరచాయి. ఎలుకలు కుట్టడంతో చేతులు, కాళ్ల నుంచి రక్తం కారుతున్నట్లు బంధువులు గుర్తించారు. వారు వెంటనే వైద్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో వైద్య సిబ్బందిని అప్రమత్తమై షేక్ ముజీబ్ చికిత్స అందించారు. ఇతర రోగుల అటెండెంట్లు కూడా ఆసుపత్రిలో ఎలుకల బెడద గురించి ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిని రోగి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
Read also: Airtel Recharge Paln 2024: అపరిమిత 5జీ డేటా.. ఎయిర్‌టెల్ బెస్ట్ రీచార్జ్ ప్లాన్స్ ఇవే!
వైద్యఆరోగ్య శాఖ మంత్రి సి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ జె అజయ్ కుమార్ ఆసుపత్రిని సందర్శించి ఘటనపై ఆరా తీశారు. అనంతరం అజయ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఎలుకలు రాకుండా ఆస్పత్రి పారిశుద్ధ్య విభాగం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వివిధ ప్రదేశాలలో మౌస్ ట్రాప్‌లు ఉంచబడ్డాయి. వివిధ గదులు, ఎన్‌క్లోజర్‌లపై అన్ని రంధ్రాలు, ఖాళీలు పరిష్కరించబడ్డాయి. తెగులు నియంత్రణ చర్యలు కూడా తీసుకోబడ్డాయని చెప్పారు. ఈ సమస్యపై విచారణకు ఆదేశించామని, ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యంగా తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతర్గత విచారణకు ఆదేశించామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ విజయలక్ష్మి తెలిపారు. అయితే ఈ ఘటనపై సర్కార్ సీరియస్ తీసుకోవడంతో.. నిఐసీయూ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ వసంత్ కుమార్, కావ్య తో పాటు సర్సింగ్ ఆఫీసర్ మంజులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Jammu & Kashmir: కశ్మీర్ లో దారుణం.. ముగ్గురు బాలికలు సజీవదహనం..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!