Kukatpally Crime News: హైదరాబాద్ కూకట్ పల్లి ఆల్విన్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఒంటి పై పెట్రోల్ పోసుకుని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు కు చెందిన శిరీష బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. చదువుతో పాటు జావ కోర్సులో జాయిన్ అయి గత కొన్నాళ్లుగా ఆల్విన్ కాలనీ లోని తన బంధువుల ఇంట్లో ఉంటుంది. ఈరోజు ఉదయం 10.30 గంటల ప్రాంతంలో చిన్న బాటిల్ లో పెట్రోల్ తీసుకుని ఫోర్త్ ఫ్లోర్ పైకి వెళ్లింది.
పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది.. శిరీష అరుపులు కేక లు వేయడం తో కింద పోర్షన్ లో అద్దెకు ఉన్న వారు పైకెళ్లి చూశారు.. అప్పటికే పూర్తిగా మంటల్లో శిరీష చిక్కుకుపోయింది. తన శరీరం చాలావరకు కాలిపోయింది. వెంటనే దుప్పటి తో అర్పేసి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు.. 108 కి ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చేలోపే శిరీష మృతి చెందింది. శిరీష ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. తను బలవర్మరణానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం శిరీష మృత దేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Read Also: SriReddy: రానా తమ్ముడితో నాకు శోభనం అక్కడే జరిగింది.. దాన్ని కూల్చకండి