సంక్రాంతి వచ్చేసింది. సిరి సంపదలు, భోగ భాగ్యాలతో విలసిల్లి.. మకర సంక్రాంతి మరుపురాని మధుర స్మృతులకు వేదికవుతుంది. ఆరుగాలం కష్టపడిన పండించిన పంట ఇంటికి వస్తుంది. అందుకే దీన్ని కర్షకుల పండగ అని కూడా పిలుస్తారు.
ఏడాదికి ఒక్కసారి వచ్చే సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఎంత గ్రాండ్ గా జరుపుకుంటారో తెలుసు.. ఈ పండగను పేద, ధనిక అని తేడా లేకుండా వారికి ఉన్నంతలో ఘనంగా జరుపుకుంటారు.. ఈ సంక్రాంతి కొన్ని కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.. గత రెండు రోజులుగా గాలిపటాలు ఎగరేసిన ఘటనల్లో తెలంగాణ వ్యాప్తంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు యువకులు విద్యుదాఘాతంతో, పైకప్పుపై నుండి పడి ప్రాణాలు కోల్పోగా, మరో యువకుడు మంజా తగిలి మరణించాడు.. వీటిలో…
Man severely injured due to Chinese Manja: చైనా మాంజాదారం ప్రజల పాలిట ఉరితాడులా మారుతున్నాయి. సంక్రాంతి వచ్చిందంటే చాలు గాలిపటాలను ఎగరేస్తుంటారు. అయితే కొంత మంది మాత్రం నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత చైనా మాంజా దారాన్ని వాడుతున్నారు. గాలిపటాలు నేలపై పడిపోయినప్పుడు ఆ దారం ద్విచక్రవాహనదారులు, పాదచారులకు ప్రమాదంగా మారుతున్నాయి. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. వేగంగా బైకుపై వెళ్తున్న సమయంలో గొంతకు, మొహానికి చిక్కుకుని ప్రాణాలకు ప్రమాదంలోకి నెట్టుతున్నాయి.
Chinese Manja : గాలిపటాలు ఎగురవేసేటప్పుడు చైనా మాంజా అస్సలు ఉపయోగించొద్దంటూ పదపదే ప్రభుత్వ అధికారులు సూచిస్తుంటారు. అంతేకాకుండా చైనా మాంజా విక్రయాలపై ప్రభుత్వం నిషేధం కూడా విధించింది.
సంక్రాంతి అనగానే గాలి పటాలను ఎగుర వేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక పిల్లలకు అయితే ఈ పండుగ ఎంత ప్రత్యేకమో చెప్పనవసరం లేదు. సంక్రాంతి సెలవుల్లో పిల్లలందరూ గాలిపటాలను ఎగురవేయడమే కాకుండా, గాలిపటాల ఎగురవేతపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో పిల్లలు ఇతరుల గాలిపటాలను ఓడించేందుకు నిషేధిత దారాలను ఉపయోగిస్తుంటారు. అయితే గాలి పటాలను ఎగురవేసేటప్పడు దానికి వాడే దారం, మాంజా వంటివి ఎన్నో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్…