Chinmayi: సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తన మెస్మరైజ్ వాయిస్ తో సంగీత ప్రియు ల మనసులను కొల్లగొడుతూ ఉంటుంది. ఇక చిన్మయి వివాదాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మాయిలను, చిన్న పిల్లలను, జంతువులను ఎవరైనా హింసించిన, విమర్శించిన ఆమె సోషల్ మీడియాలో విరుచుకుపడుతూ ఉంటుంది. ఇక చిన్మయి.. నటుడు, దర్శకుడు అయిన రాహుల్ రవీందర్ ను 2014 లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. దాదాపు ఎనిమిదేళ్ల తరువాత అంటే.. గతేడాది ఈ దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చారు. వారి పేర్లు.. ధ్రిప్త, శర్వాస్. చిన్నారులు పుట్టినప్పటినుంచి ఇప్పటివరకు వారి ముఖాలను ఏరోజు ఈ జంట అభిమానులకు చూపించలేదు.
Kajal Aggarwal: ఇండస్ట్రీకి బ్రేక్.. ఇచ్చిపడేసిన చందమామ..?
నేటితో ఈ చిన్నారులు రెండో ఏడాదిలోకి అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చిన్మయి.. తన కవల పిల్లల ముఖాలను అభిమానులకు చూపించింది. పుట్టినప్పటినుంచి ఇప్పటివరకు.. మెమొరీబుల్ మూమెంట్స్ ను ఫోటోల రూపంలో చూపించింది. ఇద్దరు అల్లరి చేయడం.. నిద్రపోవడం, ఆడుకోవడం, తండ్రి రాహుల్ తో వీడియో కాల్ లో మాట్లాడడం ఇలా అన్ని ఫోటోలను షేర్ చేస్తూ .. ఇది గొప్ప ఆశీర్వాదం అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక అభిమానులు.. చిన్నారులు చాలా క్యూట్ గా ఉన్నారని కామెంట్స్ పెడుతున్నారు. అంతే కాకుండా రాహుల్ కు ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్పుకొస్తున్నారు.