ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డాక్టర్ పార్థసారథి జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ గర్జన పేరుతో రాయలసీమ పై మరోసారి మోసానికి తెగబడుతోందని మండిపడ్డారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమం అన్నారు. వైసీపీ రాయలసీమను అభివృద్ధి చేయలేక ఇచ్చిన హామీలను నెరవేర్చలేక రాయలసీమ గర్జన పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా కొత్త నాటకానికి తెర లేపడం సిగ్గుచేటన్నారు. అన్యాయానికి గురైన వాళ్ళు నిరసన తెలుపుతూ సభలు పెడతారు..! నేడు ” రాయలసీమకు అన్యాయం చేసినవాళ్లే సభలు పెట్టి నిరసన తెలపడం విడ్డురంగా ఉందని ఎద్దేవా చేశారు.
కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు మద్దతు తెలిపింది మొదటగా బీజేపీయే అన్నారు. వైస్సార్సీపీ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని ప్రజలకు చెబుతూ మోసం చేస్తోంది. మీకు చిత్తశుద్ధి ఉంటే – హైకోర్టు కర్నూల్లో పెడతామని ఇంతవరకు ‘ కేంద్రానికి, సుప్రీంకోర్టుకు, మంత్రిత్వ శాఖకు కు గత 3 సంవత్సరాలలో ఎందుకు ప్రతిపాదనలు పంపలేదు. గత వారంలో సుప్రీంకోర్టు లో ప్రభుత్వ న్యాయవాది వేణుగోపాల్ హైకోర్టు అమరావతిలోనే ఉండాలన్నది ప్రభుత్వ కోరిక’ అని చెప్పింది నిజం కాదా? అన్నారు. మీకు రాయలసీమ న్యాయ రాజధాని ఏర్పాటు పై చిత్తశుద్ధి ఉంటే కర్నూలు లో ఏర్పాటు కావలసిన జ్యుడీషియల్ అకాడమీని మంగళగిరికి ఎందుకు తరలించారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
కర్నూలులో ఏర్పాటు కావలసిన కృష్ణా రివర్ బోర్డుని విశాఖకు ఎందుకు తరలించారో సమాధానం చెప్పాలి..?వైస్సార్సీపీ ప్రభుత్వం RDMP ( రాయలసీమ దుర్భిక్ష నివారణ కమిషన్ ) పేరుతో రాయలసీమలోని 23 ప్రాజెక్టులను రూ.33,862 కోట్లతో అభివృద్ధి చేస్తామని గతంలో ప్రకటించారుగా ఏమైంది ? గత 3 సంవత్సరాలలో RDMP కోసం నిధులు కేటాయించకుండా సీమ ప్రజలను మరోసారి మోసం చేయలేదా.? మీరు ఇచ్చిన హామీ మేరకు RDMP కి నిధులు మంజూరు చేయకపోవడం కారణంగా వ్యవసాయ పనులు లేక , రైతు కూలీలు వలసలు పోతున్నారు అలాంటి వారి ఉపాధి కోసం మీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు.?
Read Also: Gujarat Elections: ప్రధాని మోదీ, అమిత్ షాలపై కాంగ్రెస్ ఫిర్యాదు.. రోడ్ షోపై రచ్చ
గతంలో జగన్ గారు ప్రజల సమక్షంలో పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం … కేసీ కేనాల్ ఆధునికీకరణ .. హంద్రీనీవా కాలువ విస్తరణ …సిద్దేశ్వరం ..అలుగు మరియు వేదావతి .. వంటి ప్రాజెక్టు లను పూర్తి చేస్తానని ఇచ్చిన హామీలను ఇంతవరకు ఎందుకు నెరవేర్చలేదో సీమ ప్రజలకు సమాధానం చెప్పాలి..?? ఈ డిసెంబర్ 23 కి జగన్ గారు కడప ఉక్కు ఫ్యాక్టరీ కి శంకుస్థాపన చేసి 3 సంవత్సరాలు అవుతోంది. !! మరి ఇంతవరకు ఎందుకు మొదలవలేదు ?ఎప్పుడు పూర్తి చేస్తారు ? ఇక్కడి బిడ్డలకు ఉద్యోగాలు రావడం మీకు ఇష్టం లేదా..? రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటు ,అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని వెనుకబడేలా చేసిన మీరే నేడు రాయలసీమను అభివృద్ధి చేస్తామని చెప్పి డ్రామాలు ఆడడం ఎంతవరకు సమంజసం.? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందుగా రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పి, యుద్ధ ప్రతిపాదికన రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డా.పార్థసారథి డిమాండ్ చేశారు.
Read Also: Zomato: డెలివరీ చేసింది చాలు. ఇక.. ‘‘ఇంటికి వెళ్లండి’’