Somu Veerraju: ప్రజలు విదేశీ వస్తువులను విడనాడి స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ నినాదంతో ముందుకు వెళ్లాలని సూచించారు.. రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానంలో ఏర్పాటుచేసిన ఖాదీ సంతను ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రారంభించారు. . రెండు రోజులు పాటు ఖాదీ సంత నిర్వహించనున్నారు.. ఖాదీ ఫర్ నేషన్ – ఖాదీ ఫర్ ఫ్యాషన్ నినాదంతో ఈ ఖాదీ సంత ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా…
కూటమి ప్రభుత్వంలో తీసుకుంటున్న ప్రతి చర్యతో మాజీ సీఎం వైఎస్ జగన్‌కు జ్ఞానోదయం కలగాలని వ్యాఖ్యానించారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. పార్వతిపురం మన్యం జిల్లాలో అంబేద్కర్ జయంతి వారోత్సవాల్లో పాల్గొన్న ఆయన.. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విశాఖలో మేయర్ గా కుటమి అభ్యర్థి విజయం సాధించారు.. జగన్మోహన్ రెడ్డి దీనిపై మాట్లాడుతూ రాష్ట్రంలో గడ్డు పరిస్థితి ఏర్పడిందని విమర్శించడం దారుణం అన్నారు.
మంత్రి పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన.. ఈ మధ్యే ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసి.. తొలిసారి రాజమండ్రి వచ్చిన సందర్భంగా ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది.. అయితే, తనకు మంత్రి కావాలని లేదు.. మంత్రి కావాలని అనుకుంటే 2014లోనే అయ్యే వాడిని అని స్పష్టం చేశారు.. నా జీవితానికి ఇది చాలు.