Site icon NTV Telugu

MLA Rakesh Reddy: అమెరికాలో ఉద్యోగం చేసిన కవితకు తెలంగాణ పౌరుషం లేదు..

Mla Rakesh Reddy

Mla Rakesh Reddy

అమెరికాలో ఉద్యోగం చేసిన కవితకు తెలంగాణ పౌరుషం లేదని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి అన్నారు. తమ లాంటి వారికి తెలంగాణ వాదం నేర్పించింది బీజేపీ అని.. తమకు కాకుండా ఇంకెవరికి తెలంగాణ పౌరుషం ఉంటది? అన్నారు. తమది హిందుగాళ్లు బొందు గాళ్లు అన్న రక్తం కాదని.. కవిత స్టేట్మెంట్ ఇచ్చే ముందు స్థాయి చూసుకోవాలని విమర్శించారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. రాహుల్ గాంధీది ఇటలీ రక్తం.. మోడీది హిందువు రక్తం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటలీ గాంధీ స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని.. అమెరికా చెప్తే వినడానికి మాది పాత భారత్ కాదు ఇది కొత్త భారత్ అని తెలిపారు. రాహుల్ టి షర్ట్స్ వేసుకోవడం మాని తెలివితో మాట్లాడాలని ఎద్దేవా చేశారు.
బీఆర్‌ఎస్ ధర్నా చౌక్‌లు ఎత్తేసిందని.. కల్వకుంట్ల కుటుంబానికి, కవితకు ధర్నా చౌక్ లో నిలబడే అర్హత లేదన్నారు.

READ MORE: TGTET 2025 : టీజీ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. ఈ నెల 18 నుండి టెట్ పరీక్షలు..

కాళేశ్వరానికి అన్ని తానే అని అపర బ్రహ్మా కేసీఆర్ చెప్పుకున్నారు.. అపర బ్రాహ్మ అని చెప్పుకున్న కేసీఆర్‌కు కూతురు కవిత డాడీ డాడీ స్ట్రక్చర్ ఎలా నిర్మించారని మరొక్క లెటర్ రాయాలని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ ఏ కాలేజీలో చదివారు.. ఎక్కడ సివిల్ ఇంజనీరింగ్ చేశారు? ఎన్ని ప్రాజెక్ట్ లు చేశారు? అని ప్రశ్నించారు. తాము ఇప్పటిదాకా ఈడీ ఒక్కదాన్నే చూపించామని.. మీరు చూడాల్సిన డీలు ఇంకా చాలా ఉన్నాయన్నారు. అధికార గణమంతా అందాల భామల చుట్టూ తిరిగారని.. తెలంగాణ రైతులు పండించిన పంట కొనుగోలు పూర్తిగా జరగలేదన్నారు. రైతులు వారి బాధలు చెప్పుకునేందుకు బీజేపీ భరోసాకు క్యూ కట్టారని వెల్లడించారు. సీఎం, మంత్రులు పరిపాలనను గాలికి వదిలి ఢిల్లీలో మకాం వేశారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి 18 నెలల్లో 45 సార్లు ఢిల్లీకి వెళ్లారన్నారు. భరోసాలో జాబ్ క్యాలెండర్ పై ఫిర్యాదులు వచ్చిందన్నారు.. వర్షాకాలం ముందే వచ్చిన రైతు బంధు రాకపోవడం బాధాకరమని తెలిపారు. మీ కుమ్ములాటలు పక్కన పెట్టీ వెంటనే రైతు బంధు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

READ MORE: Vidadala Rajini: ప్రజలకు ఏమీ చేయకుండా.. కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడుస్తోంది!

Exit mobile version