బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో బీజేపీ పదాధికారుల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్న జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలను ఖరారు చేయనున్నారు. మీటింగ్ లో పార్టీ అధ్యక్షుడి పదవీ కాలాన్ని పొడిగించే ప్రతిపాదనపై సైతం చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం నేటి నుంచి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో జరగనుంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. నేటి నుంచి ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుంది.
Also Read : Dasara: మార్చ్ 30న ధూమ్ ధామ్ చేద్దాం…
ఢిల్లీలోని ఎన్‌డీఎంసీ కన్వెన్షన్ సెంటర్‌లో సాయంత్రం 4 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో ఈ ఏడాది 9 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల వ్యూహం సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. 2024లో గెలుపు సూత్రాన్ని బీజేపీ నేతలకు ప్రధాని మోదీ చెప్పనున్నారు. కాగా, ఇవాళ జరగనున్న సభకు ముందు బీజేపీ ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇవాళ ఢిల్లీలో ప్రధాని మోదీ మెగా రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ రోడ్‌షో ద్వారా బీజేపీ 2024 మిషన్‌ను ప్రారంభించనుంది.
Also Read : NBK: ఇందుకే మా బాలయ్య బంగారం…