ఈ నెల 8న రాష్ట్రానికి ప్రధాని మోడీ రానున్నారు. ఈ నేపథ్యంలో.. రేపు వరంగల్ లో సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు బీజేపీ నేతలు. సమావేశానికి కిషన్ రెడ్డి, సంజయ్, ఈటల రాజేందర్… జాతీయ కార్యవర్గ సభ్యులు హాజరుకానున్నారు. అయితే.. రేపు ఒకే వేదిక మీదకు ఎడ మొహం, పెడ మొహంగా ఉన్న ఆ నేతలు రానున్నారు. ఈ సమావేశంలో సభ ఏర్పాట్లు , జన సమీకరణ పై చర్చించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా, చుట్టూ పక్కల ఉన్న
మండల , ఆ పై స్థాయి కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. మోడీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. బీజేపీ గ్రాఫ్ పడిపోతుందని ప్రచారానికి చెక్ పెట్టాలని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. పర్యటనలో భాగంగా జూలై 8న కాజీపేటలోని వ్యాగన్ ఓవర్ హాలింగ్ సెంటర్ కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. దీంతో పాటు వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్కు కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లి లబ్ది పొందాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.