ఓటమి భయం తో డైవర్షన్ పాలిటిక్స్ ను కేసీఆర్ నమ్ముకున్నారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అయ్యా కొడుకులు అడ్డం పన్నా మునుగోడు లో మునగడం ఖాయమననారు. బీజేపీ ని ముట్టుకుంటే తేనె తెట్టేను కదిలించినట్టే అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. మునుగోడులో మునిగిపోతామన్న భయం పట్టుకొని తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్ లు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తెర లేపిల్లు. సర్వే ఫలితాలన్ని బీజేపీ కు అనుకూలంగా రావడం తో మునుగోడు లో రాజన్న గెలుపు తో అధికారం పోతుందేమో అన్న భయం తో దొంగ నాటకాలు ఆడుతున్నారు. మీరు కొసలు కొసలు లాగితే మేం మొదలే పీకే రకం గుర్తుపెట్టుకోండి. ఎనకటికి ఒక సాత్రం ఉంది. అసలే కోతి కళ్ళు తాగింది, దాని కాలుకు ముళ్ళు కుచ్చుకుంది అన్నట్టు. ప్రజా వ్యతిరేకత తప్పించుకోవడం కోసం టీఆర్‌ఎస్ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చిన ఉపయోగం లేకపోవడం… సెంటిమెంట్ ల చంద్రశేఖర్ రావు కు సుడి అడ్డం తిరిగి బిడ్డ లిక్కర్ స్కాం లో ఇరుక్కోవడం. ఇప్పుడే మునుగోడులో మునిగిపోతాంది అన్న సర్వే రిపోర్ట్ లు రావడంతో భయం పట్టుకొని అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆటలాడుతున్నాడు.
Also Read : Komatireddy Rajgopal Reddy : తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నిక తేదీ దగ్గరపడే కొద్ది కేసీఆర్‌కి నిద్ర పట్టడం లేదు
కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ప్రజలు లీడర్లు తయారు చేస్తారు. ఆ ప్రజల వెంట లీడర్లు వెళ్ళాలి తప్ప లీడర్ల వెంట ప్రజలు రారు అన్న వాస్తవాన్ని గ్రహించాలి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో బీజేపీ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డిని. దుబ్బాక సమయంలో తోట కమలాకర్ ను, హుజూరాబాద్ ఎన్నికల సమయం లో పెద్దిరెడ్డి, ముత్కుపల్లి, కౌశిక్ రెడ్డి ఇలా ఎందరు నాయకులను అంగట్లో సరుకులా బేరం పెట్టిన ప్రజలు పట్టించుకోలేదు. అలాగే ఇప్పుడు మునుగోడు లో మునిగిపోయే కారును కాపాడుకోవడం కోసం శ్రావణ్ లు, స్వాములు ఎందరు పోయినా శాట్ల బియ్యం ల మెరిగెలు ఏరినట్టే తప్ప బీజేపీ కీ పోయేదేం లేదు. ఇప్పటికీ దెబ్బమీద దెబ్బ పడిన కారును నిండుగా ఎక్కిస్తే బాగా ఉరుకుతది అనుకుంటున్నారు కానీ ఓవర్ load అయి అక్కడనే పంటది అడుగు కూడా ముందుకు కదలదు. కేసీఆర్ కు తెలుసు మునుగోడులో మునిగితే తేలడం కష్టం అని అందుకే ఈ దొంగ నాటకాలు. కేటీఆర్ సంక ఎక్కిన పిల్లులన్ని ఒకటే పాట పాడుతున్నయ్. వారి లక్ష్యం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని దెబ్బ తియ్యాలి అనుకోవడం కానీ… రాజగోపాల్ రెడ్డి బీజేపీ ఇప్పుడు కొలిమిలో మరుగుతున్న ఇనుప కడ్డీ… మీరు కొట్టే దెబ్బతో కత్తిలా మారి మిమ్మల్నీ అంతం చెయ్యడం ఖాయం. బీజేపీ నాయకులు కార్యకర్తలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బీజేపీ మీద భయం తో ట్విట్టర్ టిల్లు ఆడుతున్న ఆట ఇది’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.