Congress: బీజేపీ ఐటీశాఖకు రూ.4600 కోట్లు కట్టాలి.. వారిని వదిలేసి మాకు నోటీసులిచ్చారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐటీ శాఖకు బీజేపీ సుమారు 4600 కోట్ల రూపాయల పెనాల్టీ కట్టాల్సి ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపలు గుప్పించింది. ఆ డబ్బును వసూల్ చేసేందుకు బీజేపీకి ఆదాయపు పన్ను శాఖ డిమాండ్ నోటీసు ఇవ్వాలని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ పేర్కొన్నారు. మేం పాల్పడిన ఉల్లంఘనలను సమీక్షించేందుకు ఎలాంటి అంచనాలు చేశారో.. అలాగే బీజేపీ ఉల్లంఘనలను తాము కూడా స్టడీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దాని ప్రకారం బీజేపీ 4600 కోట్ల రూపాయల జరిమాన కట్టాల్సి ఉంటుంది అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, కాంగ్రెస్ పార్టీ 1700 కోట్ల రూపాయల ఫైన్ కట్టాలని తాజాగా ఐటీ శాఖ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ వివాదం కొనసాగుతుంది. తమకు ఇచ్చిన పన్ను పెనాల్టీ నోటీసుపై మూడు సార్లు సుప్రీంకోర్టును ఆశ్రయించామన్నారు.. ఈ కేసులో తదుపరి విచారణ ఏప్రిల్ ఒకటో తేదీన ఉందని అజేయ్ మాకెన్ అన్నారు.
Read Also: Sunitha Kejriwal : కేజ్రీవాల్‌కు ఆశీర్వాద ప్రచారం.. వాట్సాప్ నంబర్ రిలీజ్ చేసిన సునీతా కేజ్రీవాల్
Also Read
- TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
- Special Trains: సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
- Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
- SRH: సన్ రైజర్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. 2027 ఐపీఎల్‌కు కాటేరమ్మ కొడుకు దూరం..
ఇక, బీజేపీ పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ అధికారుల నోటీసులు తమ స్పూర్తిని దెబ్బ తీయలేవని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి దాడులకు తమ పార్టీ భయపడదు.. న్యాయం కోసం తాము పోరాటం చేస్తునే ఉంటామన్నారు. ఎలక్టోరల్ బాండ్ స్కామ్‌ను వేర్వేరు రూట్లలో చేశారు.. ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్, పోస్టు రెయిడ్, షెల్ కంపెనీ గ్రూపుల ద్వారా ఈ బాండ్ల కుంభకోణం జరిగిందన్నారు. పన్ను ఉగ్రవాదంతో కాంగ్రెస్‌పై అటాక్ చేస్తున్నారని జైరాం రామేశ్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
-
Special Trains: సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
-
Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
-
Vijay Antony: సీఎం విజయ్‌ని కలిసిన ‘బిచ్చగాడు’ హీరో.. నెట్టింట వైరల్‌గా మారిన ఫోటోలు!
ట్రెండింగ్
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!