ఢిల్లీలో అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక.. గత ఆప్ ప్రభుత్వ విధానాలపై అసెంబ్లీలో కాగ్ రిపోర్టులను బీజేపీ బహిర్గతం చేస్తోంది. ఇటీవల మద్యం కుంభకోణానికి సంబంధించిన రిపోర్టును ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా బయటపెట్టారు.
హైదరాబాద్ లోని పలు బ్లడ్ బ్యాంకులపై డ్రగ్ కంట్రోల్ బ్యూరో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. సికింద్రాబాద్, మెహదీపట్నం, బాలనగర్, హిమాయత్ నగర్, లక్డీకాపూల్, మలక్ పేట్, ఉప్పల్, చైతన్యపురి, కోఠిలోని 9 బ్లడ్ బ్యాంకుల్లో తనిఖీలు చేపట్టారు. ప్రమాణాలు పాటించని 9 బ్లడ్ బ్యాంకులకు నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా.. బ్లడ్ బ్యాంకుల నిల్వ, రక్త సేకరణ పరీక్షలలో పూర్తిగా లోపాలున్నట్లు డ్రగ్ కంట్రోల్ బ్యూరో గుర్తించింది. ప్లేట్ లెట్లు, ప్లాస్మా నిల్వలో పూర్తిగా లోపాలు గుర్తించింది.…