Fastag : దేశంలో ఫాస్టాగ్‌కు సంబంధించి కొత్త నియమాన్ని త్వరలో ప్రవేశపెట్టవచ్చు. ఫాస్టాగ్ కోసం వార్షిక టోల్ పాస్‌ను ప్రవేశపెట్టాలని భారత ప్రభుత్వం పరిశీలిస్తుంది. తద్వారా ఫాస్టాగ్‌ను మళ్లీ మళ్లీ రీఛార్జ్ చేయవలసిన అవసరం ఉండదు. దీని కోసం ఏడాది పొడవునా ఒకసారి రూ. 3,000 డిపాజిట్ చేయాలి. తద్వారా ఏ ఎక్స్‌ప్రెస్‌వే, జాతీయ రహదారిపై ఒక సంవత్సరం పాటు ఎటువంటి టోల్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ నిబంధనను ప్రైవేట్ వాహనాలకు మాత్రమే తీసుకుని వచ్చే అవకాశం ఉంది.
Read Also:Allu Arjun : పాకిస్థాన్ జైల్లో అల్లు అర్జున్ ఫ్యాన్.. అక్కడే పుట్టిన తండేల్!
కొత్త ఫాస్టాగ్ నియమం వల్ల ఎవరు ప్రయోజనం పొందుతారు?
ఈ కొత్త ఫాస్టాగ్ నిబంధనను ప్రవేశపెట్టడం వల్ల రోడ్డు ప్రయాణాలకు వెళ్లాలనుకునే వారికి లేదా వారి వ్యక్తిగత వాహనంలో ప్రయాణించడానికి ఇష్టపడే వారికి ప్రయోజనం చేకూరుతుంది. ఒకసారి టోల్ ఛార్జీలో కనీసం రూ. 200 తగ్గుతుంది. సుదూర ప్రయాణం చేస్తే అప్పుడు రూ. 700-800 కూడా టోల్ ఫీజు తగ్గుతుంది. తరచుగా ప్రయాణించే వారికి టోల్ ఛార్జీల భారం ఎక్కువగా ఉంటుంది. కొత్త నిబంధన అమలులోకి వస్తే కేవలం రూ. 3,000 టోల్ పాస్‌తో ఈ వ్యక్తులు ఏదైనా జాతీయ రహదారి లేదా ఎక్స్‌ప్రెస్‌వేపై ఆపకుండా అనేకసార్లు ప్రయాణించవచ్చు.
Read Also:MG Astor : పనోరమిక్ సన్‌రూఫ్ తో అందుబాటులోకి ఎంజీ ఆస్టర్.. దాని ధర ఎంతో తెలుసా ?
సంవత్సరానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే తమ వ్యక్తిగత వాహనంలో ప్రయాణించే వారికి ఈ ఫాస్టాగ్ టోల్ పాస్ ప్రయోజనకరంగా ఉండదు. ఏడాది పొడవునా ఈ రూ. 3,000 టోల్ పాస్ వారికి ఖరీదైనది అనిపించవచ్చు. కానీ రెగ్యులర్ గా ప్రయాణించే వాళ్లకు చాలా ప్రయోజనకరం. ఫాస్టాగ్ కోసం ఈ కొత్త నిబంధన ప్రవేశపెట్టడంతో.. ప్రభుత్వానికి టోల్ వసూలు చేయడం సులభం అవుతుంది. టోల్ ప్లాజాల వద్ద క్యూలు కూడా తగ్గుతాయి. వార్షిక టోల్ పాస్‌తో పాటు, ప్రభుత్వం ఒక వాహనానికి జీవితకాలం లేదా 15 సంవత్సరాల టోల్ పాస్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. దీనిని రూ. 30,000 కు కొనుగోలు చేయవచ్చు. ఈ జీవితకాల టోల్ పాస్ తీసుకున్న తర్వాత, టోల్ ప్లాజా వద్ద ఆ వాహనానికి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.