మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ మధ్య సైలెంట్ గా పూజా కార్యక్రమాలు నిర్వహించిన సినిమా యూనిట్ ఈమధ్య షూటింగ్ కూడా సైలెంట్ గానే మొదలుపెట్టేసింది. ఇప్పటికే మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ఇద్దరి మీద ఒక కీలక సన్నివేశాన్ని ఐదు రోజుల పాటు అల్యూమినియం ఫ్యాక్టరీలో సిద్ధం చేసిన సెట్లో షూట్ చేశారు. తదుపరి షెడ్యూల్ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ నానా పటేకర్ కనిపించబోతున్నారు. ఇప్పటికే ఆయనకు లుక్ టెస్ట్ కూడా నిర్వహించారు. మహేష్ తండ్రి పాత్ర కోసం ఆయన తీసుకున్నారేమో అని అనుమానాలు అయితే టీంలో ఉన్నాయి కానీ ఆ విషయాలు బయటకు వెల్లడించేందుకు ఎవరు సాహసించడం లేదు.
Allu Arjun : పాకిస్థాన్ జైల్లో అల్లు అర్జున్ ఫ్యాన్.. అక్కడే పుట్టిన తండేల్!
ఇక ఈ సినిమా టైటిల్ ఫిక్స్ చేసేందుకు సమాయత్తమవుతున్నారు రాజమౌళి. ఇప్పటికే గరుడ, మహారాజు అనే రెండు టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి కానీ ఇవి రెండు ఇప్పటి జనరేషన్ కి కనెక్ట్ అయ్యే టైటిల్స్ కాదు. కాబట్టి జనరేషన్ అని అర్థం వచ్చేలా ఒక మంచి పదం కోసం వెతుకుతున్నారు. ఈ పదం అన్ని దేశాల వారు భాషలవారు అర్థం చేసుకునేలా ఉండాలని ప్రస్తుతానికి వెతుకులాటలో పడ్డారు. సినిమాలో తరతరాలకు చెందిన విషయాలను ప్రస్తావిస్తున్న నేపథ్యంలో ఈ జనరేషన్ అని అర్థం వచ్చే పదం అయితే కరెక్ట్ గా ఉంటుందని భావిస్తున్నారు. అయితే గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా విషయంలో రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాబట్టి ఎలాంటి విషయాలు బయటకు రాకుండా ప్లాన్ చేసుకుంటున్నారు.