తీహార్ జైల్లో తోటి ఖైదీని క్రికెట్ బ్యాట్ తో కొట్టి హత్య చేసిన కేసులో నలుగురు అండర్ ట్రయల్ ఖైదీలను ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు శుక్రవారం దోషులుగా నిర్ధారించింది. మూడేళ్ల నాటి ఈ హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారించింది.
బిల్కిస్ బానో కేసులో మొత్తం 11 మంది దోషులు ఈ నెల 21వ తేదీ లోపు లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి పొడిగింపు కోసం వాళ్లు పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
బిల్కిస్ బానో దోషుల విడుదల కేసులో సుప్రీం కోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. ఆగస్టు 2022లో బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో జీవిత ఖైదు పడిన మొత్తం 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం రిలీజ్ చేసింది.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన గోద్రా రైలు దహనం కేసు దోషులకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. గోద్రా అల్లర్లను ‘తీవ్రమైన ఘటన’గా ధర్మాసనం పేర్కొంది. 27 ఫిబ్రవరి 2002న దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది గోద్రా రైలు దహనం ఘటన. ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయలోనే ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో 59 మంది సజీవ దహ
బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మే 2న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. యాపిల్‌ను నారింజ పండ్లతో పోల్చలేమని, అలాగే ఊచకోతను హత్యతో పోల్చలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.
Convicts Escape : ఉరిశిక్ష పడిన ఇద్దరు కరడుకట్టిన ఉగ్రవాదులు కోర్టు ప్రాంగణంలోనే సినీ ఫక్కీలో తప్పించుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. వారిని ఛేజ్ చేయడానికి అధికారుల పెద్ద టీం ఇప్పుడు బయలుదేరింది.
యువతరం దేశానికి ఆధారం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, సామాజిక సేవ చేయాల్సిన యువత వివిధ నేరాలకు పాల్పడి జైళ్ళలో మగ్గుతున్నారు. తెలంగాణ జైళ్ళలో మగ్గుతున్న యువత ధైన్యస్థితి పలువురిని కలచివేస్తోంది. తెలంగాణ జైళ్ళలో ఖైదీలుగా అధిక శాతం యువత జైలు గోడలకే పరిమితం అవుతున్నారు. వివిధ కారణాల వల్ల వారు నేరస్తులు�