Viral News: ఫేమస్ కావాలనే కోరికతో దిక్కుమాలిన పని.. భార్య ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసిన భర్త.. కట్‌చేస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral News: సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించడం, వైరల్ అవ్వాలనే పిచ్చి ఈ రోజుల్లో మనుషులతో ఏమేం చేయిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొందరు ప్రాణాలకు తెగించి ప్రమాదకరమైన స్టంట్లు చేస్తే, మరికొందరు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తారు. ఇంకొందరైతే కేవలం లైకులు, కామెంట్ల కోసం తమ సొంత జీవితాన్నే నవ్వులపాలు చేసుకుంటారు. కానీ, బిహార్‌లోని కటిహార్ జిల్లాలో ఓ ఘోర ఉదంతం వెలుగు చూసింది. భార్యపై అనుమానం, కోపం, సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే తపనతో ఓ వ్యక్తి తన భార్య ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు.
బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నిందితుడికి 2023లో వివాహం జరిగింది. అయితే, పెళ్లయినప్పటి నుంచి అతనికి భార్యపై విపరీతమైన అనుమానం ఉండేది. ఆమె పుట్టింటికి వెళ్లినా, ఫోన్ కాస్త ఆలస్యంగా ఎత్తినా, లేదా బంధువులతో మాట్లాడినా అతడు లేనిపోని అనుమానాలు పెంచుకునేవాడు. ఆమెకు వేరే వ్యక్తితో సంబంధం ఉందనే భ్రమలో బతికేవాడు. ఈ అనుమానాల కారణంగా ఇద్దరి మధ్య గొడవలు పెరిగి, భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మరింత కక్ష పెంచుకున్న సదరు భర్త, ఆమెను డిజిటల్‌గా వేధించి, సమాజంలో పరువు తీయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఆమెకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫోటోలు, వీడియో క్లిప్‌లను సోషల్ మీడియాలో వైరల్ చేయడం మొదలుపెట్టాడు. తన వ్యక్తిగత జీవితం ఇలా బహిరంగం కావడంతో ఆ మహిళ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.
Also Read
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- Pakistan: పాకిస్థాన్‌ను 15 'ముక్కలు' చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
సాధారణంగా ఇలాంటి సైబర్ నేరాల వెనుక రెండు ప్రధాన కారణాలు ఉంటాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఒకటి పగ తీర్చుకునే సైకో మనస్తత్వం, రెండు సోషల్ మీడియాలో ఎలాగైనా సరే అందరి దృష్టిని ఆకర్షించాలనే వింత కోరిక. ఈ కేసులో నిందితుడు కూడా చాలా కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫేమస్ అవ్వాలని ఆరాటపడేవాడని పోలీసుల విచారణలో తేలింది. ఆ పిచ్చిలోనే అతను అన్ని హద్దులు దాటి భార్య గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించాడు. ఈ దారుణంపై సదరు మహిళ 2026, జనవరి 9న కటిహార్ సైబర్ పోలీస్ స్టేషన్లో స్వయంగా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి సోషల్ మీడియా ఖాతాలు, డిజిటల్ ఆధారాలను పరిశీలించారు. కేసు నమోదైన తర్వాత నిందితుడు కొంతకాలం పరారీలో ఉన్నప్పటికీ, పోలీసులు సాంకేతిక నిఘా సహాయంతో అతడిని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో అతను ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టినట్లు ఒప్పుకున్నాడు, కానీ భార్యపై ఉన్న కోపం, అనుమానమే దానికి కారణమని సమర్థించుకోవడానికి ప్రయత్నించాడు.
ఈ ఘటనపై కటిహార్ సైబర్ డీఎస్పీ ఆశీఫ్ ఆలం స్పందిస్తూ.. “ఎవరైనా సరే, ఒక వ్యక్తి అనుమతి లేకుండా వారి ప్రైవేట్ ఫోటోలు లేదా వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం చట్టప్రకారం నేరం. ఆ పని చేసింది భర్త అయినా, భార్య అయినా, స్నేహితులైనా సరే.. అవతలి వ్యక్తి వ్యక్తిగత స్వేచ్ఛను, గోప్యతను (Privacy) ఉల్లంఘించే హక్కు ఎవరికీ లేదు” అని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిందితుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఆ ప్రైవేట్ కంటెంట్‌ను ఇంకా ఎక్కడెక్కడ షేర్ చేశారు, డిలీట్ చేయడానికి ఏమైనా ప్రయత్నించారా అనే కోణంలో ఆ డివైజ్‌ను ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- bihar
- crime
- cyber crime
- india
- Katihar
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!