బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 దాదాపు ముగింపు దశకు చేరుకుంది.. ఫినాలీకి ఇంకా రెండు వారలు మాత్రమే ఉంది. దీంతో బిగ్‌బాస్ గేమ్ మరింత టఫ్ చేశారు.. ఎలాగైనా టైటిల్ కొట్టాలని కంటెస్టంట్స్ కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు.. సోమవారం, మంగళవారం ఎపిసోడ్స్ లలో నామినేషన్స్ గట్టిగానే జరిగాయి.. టికెట్ టూ ఫినాలే అంటూ టఫ్ టాస్క్ లతో కంటెస్టెంట్స్ పోరాడేలా చేస్తున్నారు. సోమవారం ఎపిసోడ్ నామినేషన్స్ తో ముగిసింది. ఇక మంగళవారం ఎపిసోడ్ మొత్తం టికెట్ టు ఫినాలే టాస్క్ లతో సాగిపోయింది.
ఈ టాస్క్ ల్లో మొత్తం మూడు గేమ్స్ ని పెట్టారు. మొదటి గేమ్ ‘వీల్ ఛాలెంజ్’, సెకండ్ గేమ్ ‘ఫ్లవర్ ఛాలెంజ్’, థర్డ్ గేమ్ ‘బాల్ టాస్క్’.. ఇకపోతే వీల్ చాలెంజ్ లో కంటెస్టెంట్స్ అంతా ఒక ప్లాట్‌ఫార్మ్ నిలబడతారా. గడియారం ముళ్ళులా ఒక పొడవాటి రాడ్ తిరుగుతూ ఉంటుంది. అది కాలికి టచ్ అవ్వకుండా, కింద పడకుండా దాని నుంచి తప్పించుకుంటూ ప్లాట్‌ఫార్మ్ నిలబడి ఉండాలి.. ఈ గేమ్ లో అందరు ఎలిమినేట్ అవ్వగా అర్జున్ ఒక్కడే విన్నర్ గా నిలిచాడు.. ఈ టాస్క్ టాస్క్ తరువాత ఫ్లవర్ టాస్క్‌లో.. కంటెస్టెంట్స్ అంతా పూలను ఒక దగ్గర నుంచి సేకరించి మరో చోట వేయాలి. ఈ టాస్క్ లో శివాజీ, ప్రియాంక తక్కువ పూలను సేకరించి ఎలిమినేట్ అయ్యారు..
ఈ రెండు గేమ్స్ కలిపి తక్కువ మార్కులు సంపాదించుకుంది శివాజీ, శోభాశెట్టి. దీంతో వారిద్దరిని టికెట్ టూ ఫినాలే రేస్ నుంచి తప్పుకోమని.. వారి సంపాదించిన మార్కులను మరొకరికి ఇవ్వాలని కోరారు. శివాజీ, శోభా తమ మార్కులను అమర్ కి ఇచ్చేశారు. ఇక లాస్ట్ గేమ్ బాల్ టాస్క్ కి శివాజీ, శోభా సంచాలక్స్ గా వ్యవహరించారు. ఈ బాల్ టాస్క్‌లో.. రింగ్ మధ్యలో ఉన్న బాల్ ని బయటకి లాగి తమ బుట్టలో వేసుకోవాలి. అయితే బాల్ బయటకి వచ్చిన తరువాత ఎవరైనా ఆ బాల్ ని లాకోవచ్చు అని చెప్పి ట్విస్ట్ ఇచ్చారు.. ఇక ఎపిసోడ్ చివరగా అమర్, ప్రియాంకల మధ్య గట్టి పోటి ఏర్పడింది.. అమర్, ప్రియాంక నుంచి బాల్ ని లాక్కున్నారు.. తాను మోసపోయాను అని ఎమోషనల్ అయ్యింది.. ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక ఈ వారం నామినేషన్స్ లో శివాజీ, గౌతమ్, యావర్, ప్రశాంత్, అర్జున్, ప్రియాంక, శోభా శెట్టి నిలిచారు.. మరి ఈ వారం ఎవరు హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి..