Samantha took Whoppin Remuneration for Citadel Webseries: స్టార్ హీరోయిన్ సమంత ఒకపక్క సినిమాలు చేస్తూనే మరో పక్క సోషల్ మీడియాలో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఏం మాయ చేసావే అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె తర్వాత తమిళ, తెలుగు సినిమాలలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడు స్టార్ హీరోయిన్ హోదా అనుభవిస్తున్న ఆమె పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కి కూడా కాస్త బ్రేక్ ఇచ్చింది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమెకు మయోసైటీస్ అనే ఒక ప్రాణాంతకమైన వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో సినిమా షూటింగ్స్ అన్నింటికీ బ్రేక్ చేసిన ఆమె కొన్నాళ్ల నుంచి రెస్ట్ తీసుకుంటుంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాలు ఒప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆ సంగతి అలా ఉంచితే ఆమె సినిమాలు ఆపడానికి ముందే సిటాడెల్ అనే ఒక వెబ్ సిరీస్ లో నటించింది.
Sukumar : మెగా హీరోతో సెన్సేషనల్ ప్రాజెక్ట్ సెట్ చేసిన సుకుమార్?
ఒక అమెరికన్ వెబ్ సిరీస్ కి ఇండియన్ అడాప్షన్ గా దీన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ వెబ్ సిరీస్ లో నటించేందుకుగాను సమంత షాకింగ్ లెవెల్ లో రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏకంగా ఈ వెబ్ సిరీస్ లో నటించేందుకు సమంతకి 10 కోట్ల రూపాయలు ముట్టచెప్పినట్లు చెబుతున్నారు. ఆమెకు ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో వచ్చిన క్రేజ్ తో పాటు పాన్ ఇండియాలో ఉన్న గుర్తింపు కారణంగా ఆమె డిమాండ్ చేసినంత ఇవ్వడానికి మేకర్స్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతానికి సమంత ఎలాంటి సినిమాలు ఒప్పుకోలేదు కానీ త్వరలోనే ప్రాజెక్టులు ఫైనల్ చేసి అధికారికంగా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి.