విద్యుత్ అధికారుల అప్రమత్తతో అవుటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం తప్పింది. మేడ్చల్ హైవే ఔటర్ రింగ్ రోడ్డు పై 220,132 కెవి టవర్లు నట్ బోల్టులు విప్పి వున్నాయి. ఆ టవర్లు ఉన్న భూమి యజమాని ఈపనికి పాల్పడినట్టు తెలుస్తోంది. ట్రాన్స్ కో పెట్రోలింగ్ అధికారులు వెంటనే గుర్తించి అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ల్యాండ్ యజమానిపై చర్యలకు ట్రాన్స్ కో అధికారుల ఆదేశాలిచ్చారు. చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు ట్రాన్స్ కో ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. దీంతో కేస్ నమోదు చేశారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు అధికారులు. వెంటనే తాత్కాలికంగా విద్యుత్ టవర్ పునరుద్ధరణ పనులు చేసి విద్యుత్ సరఫరా చేస్తున్నారు ట్రాన్స్ కో అధికారులు. ఇలాంటివి ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు ట్రాన్స్ కో అధికారులు.
ట్రాక్టర్ బైక్ ఢీ.. బైక్ దగ్ధం
ధాన్యం ట్రాక్టర్ బైక్‌ను ఢీకొన్న ఘటనలో బైక్ దగ్ధమైంది.ఈ ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి.యువకుడి పరిస్థితి విషమంగా మారడంతో 108లో ఆస్పత్రికి తరలించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఏడుకోట్ల తండా వద్ద అద్దంకి -నార్కెట్పల్లి రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నరసరావుపేటకు చెందిన నర్సేటి బాలరాజు…తన ద్విచక్ర వాహనంపై హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో బైక్ కింద పడి మంటలు చెలరేగడంతో ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమయింది.స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also: NTR: కొత్త లుక్ లో ఎన్టీఆర్.. సినిమా కోసం మాత్రం కాదండోయ్