NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ సినిమాలో నటిస్తున్న విషయం విదితమే. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ ఇటీవలే ఆర్ఆర్ఆర్ జపాన్ ప్రమోషన్స్ ముగించుకొని ఎన్టీఆర్ 30 కు ప్రిపేర్ అవుతున్నాడు. ఇక తాజాగా ఎన్టీఆర్ కొత్త లుక్ లో అదరగొట్టేశాడు. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ చేసిన హెయిర్ స్టైల్ ను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఇక ఈ లుక్ ఎన్టీఆర్ అదిరిపోయాడు.
అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తున్న ఎన్టీఆర్ ను చూస్తుంటే బాద్షా రోజులు గుర్తొస్తున్నాయి అంటున్నారు అభిమానులు. అయితే ఇదే ఎన్టీఆర్ 30 లుక్ అనుకుంటున్నారేమో కాదంటండోయ్. తాజాగా ఎన్టీఆర్ ఒక యాడ్ షూట్ లో పాల్గొంటున్నాడట. అందుకోసమే ఈ ప్రిపరేషన్ అని టాక్ నడుస్తోంది. ఫాంటా యాడ్ లో ఇంతకు ముందు నటించిన ఎన్టీఆర్ ఈ సారి భారీ డీల్ ని కుదుర్చుకుని రామోజీ ఫిల్మ్ సిటీలో నేడు యాడ్ షూట్ లో పాల్గొంటున్నాడని తెలిసింది. ఈ యాడ్ కోసమే యంగ్ టైగర్ ఈ లుక్ లోకి మారాడట. ప్రస్తుతం ఈ ఫోటోను ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెట్టింట వైరల్ గా మార్చేశారు. యాడ్ షూట్ కే ఈ రేంజ్ లో ఉంటే ఎన్టీఆర్ 30 కోసం ఎన్టీఆర్ ఏ లుక్ లో కనిపిస్తాడో అని అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.