విజయనగరం జిల్లా భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ పనులు జరుగుతున్న తీరును మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ పనుల కోసం రూ. 5వేల కోట్లు ప్రభుత్వం పెట్టుబడిగా పెట్టిందని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో దోనీ పోలో విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ బీడీ మిశ్రా, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ, కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు, అరుణాచల్ ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి చౌనా మెయిన్, ఎంపీ నబమ్ రెబియా కూడా పాల్గొన్నారు.