Bhavani Deeksha Viramana: రేపటి నుంచి భవానీ దీక్షా విరమణ.. ఇంద్రకీలాద్రిపై విస్తృత ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhavani Deeksha Viramana: బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో రేపటి నుంచి భవానీ దీక్షా విరమణలు ప్రారంభంకానున్నాయి. ప్రతీ ఏటా నియమ నిష్టలతో అమ్మవారిని పూజించడానికి భవానీ దీక్షను తీసుకుంటారు. మండల, అర్ధ మండల దీక్ష చేపట్టి.. తమ భవానీ దీక్ష విరమణ కోసం ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో దీక్ష విరమణ మహోత్సవాలకు దుర్గగుడి దగ్గర ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక, రేపటి నుంచి భవానీ దీక్షా విరమణలు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, ఒడిశాల నుంచి భవానీలు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. మరోవైపు భవానీ భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో.. దుర్గగుడి అధికారులు మూడు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దీక్షా విరమణలకు హోమగుండాలను అధికారులు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 6:30 గంటల నుంచి భవానీ దీక్షా విరమణలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లపై దృష్టిసారించారు.
Read Also: Jr NTR : జపాన్ నుంచి సేఫ్ గా తిరిగొచ్చిన ఎన్టీఆర్.. వైరల్ అవుతున్న ట్వీట్..
Also Read
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
ఇక, పున్నమి, కృష్ణవేణి, సీతమ్మ పటదాలు ఘాట్లలో జల్లు స్నానాలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కేశఖండన శాల, క్లాక్ రూంలను సిద్ధం చేశారు. ప్రతీ అరగంటకు ఉచిత బస్సు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పారిశుద్ధ్యం, భవానీల వస్త్రాల సేకరణ కోసం ఘాట్‌ల వద్ద ప్రత్యేక ఏర్పాటు చేశారు. భవానీలకు అమ్మవారి కుంకుమ, అన్నప్రసాదాన్ని దుర్గగుడి అధికారులు, పాలకమండలి అందించనున్నారు. మెడికల్ క్యాంపులను వినాయకుడి గుడి వద్ద నుంచి, మెట్ల మార్గం వైపు, గిరిప్రదక్షిణ చేసే దగ్గర ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో, గిరిప్రదక్షిణ మార్గంలో మజ్జిగ, పాలు, నీళ్లను అధికారులు అందించనున్నారు. పారిశుధ్యం, భవానీల వస్త్రాల సేకరణ కోసం ఘాట్ ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గతంలో జరిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. ఇప్పుడు ఏర్పాట్లపై దృష్టిసారించారు అధికారులు.
తాజావార్తలు
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!