బెజవాడ దుర్గమ్మ ఆలయంలో భవానీ దీక్ష విరమణలు ప్రారంభమయ్యాయి.. ఇవాళ్టి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు దీక్షా విరమణలు జరగనున్నాయి.. దీంతో సుమారు రోజుకి 50 వేలకు మంది పైగా భక్తులు వస్తారన్న అంచనా వేస్తున్నారు అధికారులు.. 7 లక్షల మంది భవానీ దీక్షాధారులు ఐదు రోజుల్లో గిరి ప్రదక్షిణ పూర్తి చేసి, ఇరుముడులు మల్లికార్జున మహా మండపంలో సమర్పించే విధంగా ఏర్పాట్లు చేశారు అధికారులు..
విజయవాడ ఇంద్రకీలాద్రి భవానీ దీక్షల విరమణ కార్యక్రమంకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబర్ 21 నుంచి 25 వరకు భవానీ దీక్షలు విరమణలు జరగనున్నాయి. దీక్షలు విరమణల ఏర్పాట్లపై నేడు ఇంద్రాకిలాద్రిపై సమీక్ష జరగగా.. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, విజయవాడ మున్సిపల్ కమిషనర్ జాన్ చంద్ర, విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, దుర్గగుడి ఈవో రామారావు పాల్గొన్నారు. ఈసారి 60 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, భక్తుల కోసం…
బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో రేపటి నుంచి భవానీ దీక్షా విరమణలు ప్రారంభంకానున్నాయి. ప్రతీ ఏటా నియమ నిష్టలతో అమ్మవారిని పూజించడానికి భవానీ దీక్షను తీసుకుంటారు. మండల, అర్ధ మండల దీక్ష చేపట్టి.. తమ భవానీ దీక్ష విరమణ కోసం ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు.
ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి కరుణ కటాక్షం కోసం భక్తులు అమ్మవారి దీక్షను చేపడతారనే సంగతి తెలిసిందే. నియమ నిష్టలతో అమ్మవారిని పూజించడానికి భవానీ దీక్షను తీసుకుంటారు. మండల, అర్ధ మండల దీక్ష చేపట్టి.. తమ భవానీ దీక్ష విరమణ కోసం ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు.