Jr NTR : జపాన్ నుంచి సేఫ్ గా తిరిగొచ్చిన ఎన్టీఆర్.. వైరల్ అవుతున్న ట్వీట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్ఆర్ఆర్ మూవీ తో గ్లోబల్ వైడ్ పాపులర్ అయిన ఎన్టీఆర్. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ అనే పక్కా మాస్ మూవీ చేస్తున్నారు.దేవర సినిమా కోసం ఫ్యాన్స్ సుమారు రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు. అయితే దేవర మూవీ అంతకంతకు ఆలస్యమవుతూ వచ్చింది.ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతోంది. దేవర నుంచి ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆసక్తి రేపుతున్నాయి.ఇప్పటికే ఎన్టీఆర్ తోపాటు విలన్ సైఫ్ అలీ ఖాన్ మరియు హీరోయిన్ జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజై సినిమా పై మరింత ఆసక్తిని పెంచేసాయి. ఇదిలా ఉంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వారం కిందట ఎన్టీఆర్ తన ఫ్యామిలీ తో జపాన్ కు వెళ్లిన విషయం తెలిసిందే.అయితే కొత్త ఏడాది మొదటి రోజైన సోమవారం (జనవరి 1) ఏకంగా 155 భూకంపాలు జపాన్ ను వణికించాయి. ఇందులో ఆరుగురు చనిపోయారు. వరుస భూకంపాలతో వణికిపోయిన జపాన్ నుంచి టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్షేమంగా బయటపడ్డారు. తాను తిరిగి ఇంటికి చేరుకున్నట్లు సోమవారం (జనవరి 1) అర్ధరాత్రి దాటిన తర్వాత ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.
జూనియర్ ఎన్టీఆర్ క్షేమ సమాచారం కోసం అభిమానులు ఎంతగానో ప్రయత్నించారు. చివరికి తాను క్షేమంగా తిరిగి వచ్చినట్లు అతడే సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో ఫ్యాన్స్ అంతా ఊపిరి పీల్చుకున్నారు.”జపాన్ నుంచి ఇవాళే ఇంటికి తిరిగి వచ్చేశాను. అక్కడి భూకంపాల వార్తలు చూసి షాక్ తిన్నాను. గత వారం రోజులు అక్కడే గడిపాను. భూకంపాల వల్ల ప్రభావితమైన అందరికీ నా ప్రగాఢ సానుభూతి. ఇలాంటి పరిస్థితుల్లోనూ అక్కడి ప్రజలు ఎంతో దృఢంగా ఉన్నారు. వాళ్లు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.తమ అభిమాన హీరో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాడన్న సమాచారంతో ఫ్యాన్స్ ఎంతో ఖుషీగా ఉన్నారు. ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ను వేల మంది రీట్వీట్స్ చేస్తున్నారు. మరోవైపు న్యూఇయర్ సందర్భంగా ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా నుంచి ఓ సర్‌ప్రైజ్ పోస్టర్ కూడా రిలీజైన విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి గ్లింప్స్ జనవరి 8న రిలీజ్ చేయబోతున్నట్లు ఈ పోస్టర్ ద్వారా మేకర్స్ వెల్లడించారు.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
Back home today from Japan and deeply shocked by the earthquakes hitting. Spent the entire last week there, and my heart goes out to everyone affected.
Grateful for the resilience of the people and hoping for a swift recovery. Stay strong, Japan 🇯🇵— Jr NTR (@tarak9999) January 1, 2024
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!