Tiger Tension : కొమురంభీం జిల్లాలో పులి సంచారం స్థానికులలో భయాన్ని పెంచుతోంది. తాజాగా, తిర్యాని మండలంలో పులి దాడి జరిగింది. ఈ దాడిలో రెండు పశువులు చనిపోయాయి. గోండు గూడ, తోయగూడ గ్రామాలకు చెందిన ఆవుల మీద పులి దాడి చేసింది. కుర్పేత కర్ణ, మడావి అంజనా బాయి లకు చెందిన ఆవులపై ఈ దాడి జరిగినట్టు నిర్ధారణ అయ్యింది. అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలం పరిశీలించారు. పులి పాద ముద్రలు గుర్తించారు. పులి…
కొమరంభీం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విధులు నిర్వహిస్తూ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన కాగజ్‌నగర్ మండలం ఈస్‌గాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఆదిలాబాద్‌కు చెందిన దయానంద్ కాగజ్‌నగర్ మండలం ఈస్‌గాం పోలీసు స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం డ్యూటీలో ఉన్న అతడికి సడెన్‌గా ఛాతిలో నొప్పి వచ్చింది. ఈ విషయాన్ని తోటి సిబ్బందికి చెప్పాడు. నొప్పితో బాధపడుతున్న అతడిని తోటి సిబ్బంది హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే దయానంద్…
మమ్మల్ని అడవిలోకి పోనివ్వడం లేదని ఆదివాసీయులు భట్టి విక్రమార్కకు వారి ఆవేదనను వ్యక్తం చేశారు. ఆరవ రోజు భట్టి పాదయాత్ర సందర్భంగా కొమురం భీం జిల్లా బూసి మెట్టలో ఆదివాసీలతో భట్టి విక్రమార్క మాట్లాడారు.
కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ లో మున్సిపల్ కార్మకులు నిరసన బాట పట్టారు. విధులు బహిష్కరించి వేతన బకాయిల కోసం ఆందోళన చేపట్టారు. అధికారుల వద్ద నుంచి ఎలాంటి స్పందన లేకపోవంతో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.
సెల్ఫీ మోజులో ప్రాణాలు కోల్పోయిన సంఘటన తిర్యాని మండలంలో చోటు చేసుకుంది. కొమరం భీమ్ జిల్లా తిర్యాని మండలంలోని చింతల మదర జలపాతం అందాలను చూడడానికి మహారాష్ట్రలోని దేవాడకు రామ్ కిషన్ బిజ్జు లోబడే (23 ) తన మిత్రులతో కలిసి చింతల మధుర జలపాతంలో ఫోటో దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి జలపాతంలో పడి గల్లంతయ్యాడు. ఈ సమాచారం మేరకు తిర్యాణి ఎస్సై రామారావు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని స్థానిక గిరిజన యువకులతో జలపాతంలో…