పొగాకు బోర్డు కేంద్ర కార్యాలయంలో అధికారులతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమావేశం ముగిసింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి టీజీ భరత్, పొగాకు బోర్డు ఛైర్మన్ యశ్వంత్ కుమార్ హాజరయ్యారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ రాజధానిలో చేపట్టే పనులపై ఏజెన్సీతో సమీక్ష నిర్వహించారు. పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్ అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడారు.
ప్రతి మహిళను మహాలక్ష్మిగా గౌరవిస్తామని.. వారిని కోటీశ్వరులుగా తయారు చేస్తామని.. ఇదే ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మహిళా సాధికారతకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.
నాలెడ్జ్ సొసైటీ మన లక్ష్యమని.. ఉన్నత విద్య అంశాలు ఏమిటనేది సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎడ్యుకేషన్, స్కిల్స్, ఉద్యోగాలు ఒక విజన్‌తో జరగాలన్నారు. రెండవ రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు కూడా అందరూ ముందుకు రావాలన్నారు.
ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది.
పారిశ్రామిక ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ) నేతృత్వంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో “ఇండస్ట్రియల్ ఎన్విరాన్ మెంట్ ఇంప్రూవ్ మెంట్ (ఐఈఐడీ)” డ్రైవ్ జరుగుతోంది. ఇవాళ్టి నుంచి జూలై 5వ తేదీ వరకూ 20 రోజుల పాటు పారిశ్రామిక పార్కుల్లో పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టారు అధికారులు. పారిశ్రామిక పార్కుల్లో తుప్పలను తొలగించడం, పేర్లను సూచించే…