NTV Telugu Site icon

Bhatti Vikramarka : భూమిలేని పేదలకు.. ప్రతి కుటుంబానికి రూ.12 వేలు ఇస్తాం

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka : బోనస్ ఇవ్వడం లేదని బీఆర్‌ఎస్‌ ఆరోపణలు చేస్తున్నారని, పండిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం లేకుండానే గతములో కట్టిన ప్రాజెక్టుల తోటే ధాన్యం రికార్డు స్థాయి లో పండుతుందన్నారు. రైతులకు మేము చేసినంత గా ఎవ్వరూ చేయలేదని, మీరు రైతులను ఎంత మోసం చేశారో ప్రజలకు తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. ఏడాది కాలం లోనే 21 వేల కోట్ల రూపాయలు రుణ మాఫీ చేశాం మీరు చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూనే రైతుల రుణ మాఫీ చేశామని, దేశం లో ఏ రాష్ట్ర ములో ఇలా ఎన్ని కోట్లు రుణ మాఫీ చేసింది లేదన్నారు భట్టి విక్రమార్క. రైతు భరోసా 7600 కోట్లు వేశామని, మీ హయంలో మీరు బందు చేసిన పదేళ్లు బీఆర్‌ఎస్‌ కట్టనీ 1514 కోట్ల రూపాయల ఇన్స్యూరెన్స్ మేమే కట్టామన్నారు. 29,888 కోట్లు ఈ రాష్ట్రంలోని రైతులకి అందచేసామని, 50,953 కోట్లు వ్యవసాయానికి రైతాంగం కోసం నేరుగా చెల్లిస్తున్నామని ఆయన తెలిపారు. ఇవన్నీ బీఆర్‌ఎస్‌ ఎప్పుడు చేయలేదని, పదేళ్లలో పంట నష్టంను బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. భూమి లేని నిరుపేద కూలీలకు 12000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చామని, డిసెంబర్ 28న పార్టీ ఆవిర్భవించిన రోజున ప్రతి కుటుంబానికి ఇవ్వనున్నామన్నారు.

AP-Telangana: సన్న ధాన్యంకు బోనస్.. ఆంధ్రా నుంచి తెలంగాణకు భారీగా లారీలు

అంతేకాకుండా..’ఇందులో మేము ఎక్కడ వెనకడుగు వేయడం లేదు.. సంక్రాంతి నాడు రైతు భరోసా అందిస్తాం.. రైతుల పక్షాన కాంగ్రెస్ వుంటుంది.. గాలి మాటలు మిలాగా మేము ఎప్పుడు చేయం.. తప్పుడు కథనాలు సోషల్ మీడియా లో చేస్తూ పబ్బం గడుపునేందుకు బీఆర్‌ఎస్‌ చేస్తుంది. 22,500 కోట్ల బడ్జెట్ తో ఇళ్ల మంజూరు చేస్తున్నాం.. గాలికి బతికున్న పార్టీ బీఆర్‌ఎస్‌.. వున్నది లేనట్లుగా బీఆర్‌ఎస్‌ చెబుతోంది… తప్పుడు కథనాలు హాస్టల్ పై ప్రచారం బీఆర్‌ఎస్‌ చేస్తుంది.. పదేళ్ల కాలం నుంచి బీఆర్‌ఎస్‌ హాస్టళ్లపై ఎప్పుడు శ్రద్ధ పెట్టలేదు. ఔటర్ రింగ్ రోడ్ ను కూడా బీఆర్‌ఎస్‌ అమ్మేసుకుంది. అన్ని జిల్లాలను కలుపుతూ ఒక్క రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం జరుగనుంది. మధ్యలో హౌసింగ్ క్లస్టర్ లను ఏర్పాటు చేస్తున్నాము. శాశ్వత పద్ధతి లో నిర్మాణం జరుగుతుంది. ఫ్యూచర్ సిటీ నీ కూడా నిర్మాణం చెబుతోంది. తెలంగాణ 4 చోట్ల ఎయిర్పోర్ట్ లు నిర్మాణం జరుగబోతోంది.. కొత్తగూడెం రామగుండం అదిలాబాద్ వరంగల్ లో ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం జరుగనుంది.’ అని భట్టి విక్రమార్క అన్నారు.

Fire Accident: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. స్పాట్‌కు 10 ఫైరింజన్లు (వీడియో)

Show comments