Wrestlers Protest: రెజ్లర్లు వీధుల్లోకి రావడం దారుణం.. వారికి న్యాయం జరగాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harbhajan Singh Neeraj Chopra Sania Mirza Supports Wrestlers Protest: లైంగిక వేధింపులకు పాల్పడుతున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలంటే.. రెజ్లర్లు గత ఆరు రోజుల నుంచి దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ఈ నిరసనలో.. భజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్‌తో పాటు ఇతర ప్రముఖ రెజ్లర్లు పాల్గొన్నారు. వీరికి క్రీడాకారుల నుంచి విస్తృతస్థాయిలో మద్దతు లభిస్తోంది. తాజాగా భారత మాజీ క్రికెటర్, పార్లమెంట్ సభ్యుడు హర్భజన్ సింగ్ వారికి సపోర్ట్‌గా నిలిచాడు. దేశానికి ఎన్నో కీర్తి ప్రతిష్టల్ని తీసుకొచ్చిన రెజ్లర్లు.. ఇలా రోడ్డుపైకి రావడం చాలా బాధాకరమని అన్నాడు. ‘‘సాక్షి మాలిక్, వినేష్ ఫోగాట్‌లు భారతదేశానికి గర్వకారణం. అలాంటి రెజర్లు దేశ వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నందుకు.. ఓ క్రీడాకారుడిగా నేను బాధపడుతున్నాను. వారికి న్యాయం జరగాలని కోరుకుంటున్నా’’ అంటూ ట్విటర్‌లో పేర్కొన్నాడు.
Ravichandran Ashwin: అశ్విన్ అరుదైన ఘనత.. ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డ్ సొంతం
Also Read
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
హర్భజన్‌తో పాటు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కూడా రెజ్లర్ల నిరసనకు మద్దతు ప్రకటించాడు. న్యాయం కోసం రెజ్లర్లు వీధుల్లో ధర్నా చేయడం తనను కలిచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన నీరజ్.. రెజ్లర్ల సమస్య పరిష్కారం కోసం అధికారులు వెంటనే స్పందించి, నిర్ణయం తీసుకోవాలని కోరాడు. ‘‘దేశం తరఫున పోటీ పడేందుకు మన అథ్లెట్లు ఎంతో కృషి చేశారు. వాళ్లు దేశానికి గర్వకారణంగా నిలిచారు. అలాంటి రెజ్లర్లు.. న్యాయం కోసం వీధుల్లోకి రావడం కలచివేస్తోంది. ప్రతి పౌరుడి సమగ్రతను, మర్యాదను కాపాడే బాధ్యత మనదే. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు ఇంకెప్పుడూ జరగకూడదు. ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి దీనిని పారదర్శకంగా, నిష్పాక్షికంగా పరిష్కరించాలి. అధికారులు తక్షణమే స్పందించి, అథ్లెట్లకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని కోరాడు. సానియా మీర్జా సైతం.. దేశానికి అవార్డులు తెచ్చిపెట్టిన రెజ్లర్లకు ఇలాంటి దుస్థితి రావడం దురదృష్టకరమని, వారికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని సపోర్ట్‌గా నిలిచింది.
PT Usha: వారి వల్ల దేశం పరువు పోతోంది.. పీటీ ఉష వివాదాస్పద వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!