Minister RK Roja: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తోన్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి ఆర్కే రోజా.. ఎన్టీఆర్ పేరు చెప్పుకుని మళ్లీ అధికారంలోకి రావాలని చంద్రబాబు ఆలోచన అంటూ ఫైర్ అయ్యారు.. ఎన్టీఆర్ జిల్లా అని చెప్పే చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు ఏం చేయలేదన్నారు.. ఒక్క జిల్లాకు లేదా మండలానికి కూడా ఎన్టీఆర్ పేరు పెట్టలేదు.. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి, పార్టీ గుర్తు, పార్టీ లాక్కున్న వ్యక్తి చంద్రబాబు.. పార్టీ డిపాజిట్లు కూడా లాక్కున్నారు అంటూ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు..
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
అసెంబ్లీలో ఎన్టీఆర్‌కి మైక్ ఇవ్వకుండా ఆయన చావుకు చంద్రబాబు కారణం అయ్యారు అని విమర్శించారు మంత్రి రోజా.. ఇన్ని చేసి ఇప్పుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు చేయటం హాస్యాస్పదమన్న ఆమె.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎన్టీఆర్ కుటుంబం చంద్రబాబుకి గుర్తు వస్తారని ఎద్దేవా చేశారు.. కానీ, అధికారంలో ఉంటే వాళ్లని బాబు పట్టించుకోరన్నారు. ఇపుడు శత జయంతి ఉత్సవం పేరిట హడావిడి చేస్తున్నారు.. ఎన్టీఆర్ పుట్టిన ప్రాంతంలో అభివృద్ధి పనులు చేయటమే కాకుండా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అంటూ ప్రశంసలు కురిపించారు మంత్రి ఆర్కే రోజా.
Read Also: Drug Prevention: మాదక ద్రవ్యాల నివారణపై సీఎం ఫోకస్.. కీలక ఆదేశాలు
ఇక, మధ్య ప్రధాని నరేంద్ర మోడీపై చంద్రబాబు పొగడ్తల వర్షంపై స్పందించిన మంత్రి రోజా.. గతంలో మోడీ గురించి చంద్రబాబు నీచంగా మాట్లాడారు.. భార్యను చూడని వాడు.. దేశాన్ని చూస్తాడా? అని మోడీని విమర్శించారు చంద్రబాబు.. అంతేకాదు నరేంద్ర మోడీని గద్దె దించటం కోసం రాహుల్ గాంధీతో జత కట్టారు.. అయితే, తాజాగా మోడీ విజన్ ఉన్న నాయకుడు అని సిగ్గు లేకుండా పొగడ్తలు గుప్పిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.. చంద్రబాబు అవసరం కోసం ఏదైనా చేస్తారని మండిపడ్డారు. వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు అధికారంలోకి వస్తే కొనసాగిస్తామని బాబు చెబుతున్నారు.. దీన్ని బట్టే జగన్ పాలన బేష్ అని చంద్రబాబు ఒప్పుకున్నారని వ్యాఖ్యానించారు మంత్రి ఆర్కే రోజా.