సూర్య తేజ ఏలే, మీనాక్షి గోస్వామి, వైవా హర్ష, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, సలీం ఫేకు, గంగవవ్వ, కృష్ణుడు, టెంపర్ వంశీ, నాగ మహేష్, టార్జాన్, మానిక్ రెడ్డి, శివన్నారాయణ, సత్తెన్న, సంతోష్ బాలకృష్ణ తదితరులు తారాగణంగా నటిస్తున్న సినిమా భరతనాట్యం. ఇక ఈ సినిమాకు కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. పాయల్ సరాఫ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమా కథను సూర్య తేజ ఏలే రాయగా.. స్క్రీన్ ప్లే బాధ్యతలను సూర్య తేజ ఏలే, కేవీఆర్ మహేంద్రలు చేపడుతున్నారు. ఇక మ్యూజిక్ ను వివేక్ సాగర్ అందిస్తుండగా ఎడిటింగ్ ను రవితేజ గిరిజాల పర్యవేక్షిస్తున్నారు. ఇక పీఆర్వో వంశీ శేఖర్ వ్యవహరిస్తున్నారు.
Also Read: Chandrababu: కొంత మందికి సీట్లు ఇవ్వలేకపోవచ్చు.. కానీ, వాళ్లు త్యాగాన్ని మరువలేను..
సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేసుకొంటున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను మొదలుపెట్టింది. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా భరత నాట్యం ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ టీజర్ ఎలా ఉందంటే..? సినిమా పరిశ్రమలో దర్శకుడు అవ్వాలనుకొనే ఓ యువకుడి కథ అనే విషయాన్ని ట్రైలర్ స్పష్టం చేసింది. దీన్తోపాటు కిరాయి గుండాలు, విలన్ల మధ్య వచ్చే ఫన్నీ కామెడీ సీన్లు కూడా బాగా ఆకట్టుకొన్నాయి. ఈ ట్రైలర్ లో హర్షవర్ణన్ విలనిజం, వైవా హర్ష, అజయ్ ఘోష్, గంగవ్వ, సలీం ఫేకు, టెంపర్ వంశీ తదితరుల క్యారెక్టర్లు కనిపించాయి. కామెడీ, కమర్షియల్ అంశాలు కలిపి తీసిన తీరు ట్రైలర్ కు ప్లస్ పాయింట్ గా మారాయి.
Also Read: Kishan Reddy: ఎంపీ సోయం బాపురావ్ కు కిషన్ రెడ్డి నుంచి పిలుపు..!
ఓవరాల్‌గా భరత నాట్యం ట్రైలర్ మాత్రం సినిమా పై ఆసక్తిని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయిందనే చూపొచ్చు. దర్శకుడు కేవీ మహేంద్ర ఇప్పటికే ‘ దొరసాని ‘ ద్వారా విమర్శకుల ప్రశంసలు అందుకొన్నారు. విభిన్నమైన కంటెంట్ తో రెండో సినిమాతో సక్సెస్ చేజిక్కించుకొనేందుకు రెడీ అవుతున్నారనే విషయం ట్రైలర్ ద్వారా స్పష్టమైంది. చుడాలిమరి ఈ కామెడీ ఎంటర్టైనర్ ఏవిధంగా తన మార్క్ ను చూపిస్తుందో. ఇక ఈ సినిమా 5 ఏప్రిల్ 2024 న థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.