Oben Rorr Electric Bike Range is 187 km in Single Charge: భారతదేశ ఆటోమొబైల్ రంగం శరవేగంగా ఎలక్ట్రిక్ వాహనాల రంగంగా మారుతోంది. నాలుగు, ద్విచక్ర వాహనాలను తయారు చేసే కంపెనీలు అన్ని ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. చాలా స్టార్టప్ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. బెంగుళూరుకు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీ ‘ఒబెన్’ తన మొదటి ఇ-బైక్‌ను రిలీజ్ చేసింది. ఆ బైక్ పేరే ‘ఒబెన్ రోర్’ (Oben Rorr). ఈ బైక్‌ను 2 గంటలు ఛార్జింగ్ చేస్తే.. 187 కిమీ ప్రయాణం చేయొచ్చు.
Oben Rorr Electric Bike Price:
ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు జూలై 2023 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ బైక్ ధర రూ.1.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). మీరు రూ. 30,000 డౌన్‌పేమెంట్ చెల్లించి కొనుగోలు చేయవచ్చు. మీరు దాదాపు రూ. 5,500 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఈ బైక్‌ను ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 187 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. దీని బ్యాటరీ 80% వరకు ఛార్జ్ చేయడానికి కేవలం 2 గంటల సమయం మాత్రమే పడుతుంది. ఒబెన్ రోర్ బైక్‌ను ఒక నిమిషం ఛార్జ్ చేస్తే.. 1 కిలోమీటరు వరకు ప్రయాణించవచ్చు.
Also Read: Shaheen Afridi 4 Wickets: టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన అఫ్రిది.. వైరల్ వీడియో!
Oben Rorr Electric Bike Batrery:
ఐపీ67 వాటర్ మరియు డస్ట్ ప్రొటెక్షన్‌తో వచ్చే లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీని ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్‌లో ఉపయోగించబడింది. ఈ బైక్‌లో 12.3 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేసే శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్‌ను అందించారు. ఈ బైక్ యొక్క గరిష్ట వేగం 100 kmph. ఇది కేవలం 3 సెకన్లలో 0 నుంచి 40 kmph వరకు వేగం అందుకోగలదు.
Oben Rorr Electric Bike Features:
ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్‌లో అనేక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. బైక్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేయవచ్చు. జియో ఫేసింగ్ మరియు డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా మీ బైక్‌ను దొంగిలించడానికి ప్రయత్నిస్తే.. మీకు ఎమర్జెన్సీ అలర్ట్ వస్తుంది. మీరు ఏ సమయంలోనైనా ఈ బైక్‌కి యాక్సెస్‌ను ఆఫ్ చేయవచ్చు. భద్రతకు ఎంతగానో ఉపయోగపడే ఈ బైక్‌లోని రెండు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.
Also Read: Shreyanka Patil CPL: చరిత్ర సృష్టించిన భారత యువ స్పిన్నర్.. తొలి ప్లేయర్‌గా రికార్డ్!