Women’s World Cup 2025 matches in doubt at Chinnaswamy Stadium: 2025 మహారాజా ట్రోఫీ టీ20 లీగ్ త్వరలో ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 11 నుంచి 28 వరకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో లీగ్ జరగాల్సి ఉంది. అయితే మహారాజా ట్రోఫీ నిర్వహణకు బెంగళూరు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దాంతో కర్ణాటక క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) వేదికను మైసూరుకు తరలించింది. ఆగస్టు 11 నుంచి నాలుగో సీజన్ మైసూరులో జరగనుంది. ఐపీఎల్ 2025 ఫైనల్ అనంతరం చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రోఫీ నిర్వహణకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది.
ఐపీఎల్ 2025 ట్రోఫీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గెలిచిన విషయం తెలిసిందే. జూన్ 4న ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఆర్సీబీపై కేసు నమోదు కాగా.. దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. మహారాజా ట్రోఫీ టీ20 లీగ్‌ను కేఎస్‌సీఏ మైసూరుకు తరలించింది.
Also Read: Haider Ali: యువతిపై అత్యాచారం.. మ్యాచ్ మధ్యలోనే పాక్ స్టార్ క్రికెటర్ అరెస్ట్!
2025 మహిళల వన్డే ప్రపంచకప్ వచ్చే నెల 30న ఆరంభం కానుంది. ఆరంభ మ్యాచ్‌కు చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే అక్కడ మ్యాచ్‌లకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. దాంతో మహిళల వన్డే ప్రపంచకప్ బెంగళూరులో జరగడం అనుమానంగా మారింది. ఒకవేళ ప్రపంచకప్ మ్యాచ్‌లకు అనుమతి లభించకపోతే.. మరో వేదికకు మ్యాచ్‌లను తరలించాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం.