Benefits Of Soaked Almonds: మనలో చాలా మంది ప్రతి రోజు ఉదయాన్నే నాలుగు, ఐదు నీటిలో నానబెట్టిన బాదం పప్పులను తింటూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల చాలా ఉపయోగాలు కలుగుతాయి. బాదం ఆరోగ్యానికి ఎంత ఉపయోగమో చాలా సార్లు మనం వినే ఉంటాం. పోషకాల గనిగా దీనిని పేర్కొనవచ్చు. అయితే మీకు ఎప్పుడైనా నానబెట్టిన బాదం పప్పులనే ఎందకు తినాలి అనే డౌట్ వచ్చిందా? అలా కాకుండా మాములుగా తింటే ఏమౌతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆరోగ్యానికి రోగనిరోధక శక్తిని పెంచడంలో బాదం పప్పులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే బాదం నానబెట్టి తింటేనే అధిక ప్రయోజనం కలుగుతుంది. బాదం తొక్కలో టానిన్లు ఉంటాయి. నానబెట్టకుండా తింటే అవి మన శరీరంలోని పోషకాలను సరిగ్గా అందుకోనివ్వవు. రాత్రి నానబెట్టి ఉదయం బాదం తినేవారికి అధిక పోషకాలు అందుతాయి.
Also Read: Asia Cup Final: గెలుపు ఆనందంలో ఉన్న శ్రీలంకకు షాక్.. ఫైనల్‌కు స్టార్ ప్లేయర్ దూరం!
నానబెట్టిన బాదాంలను తినడం వల్ల బరువు తగ్గడం, రక్తపోటు అదుపులో ఉంటాయి. ఒకవేళ మీకు పొట్టు ఇష్టం లేదనుకుంటే.. నానబెట్టిన బాదంను ఉదయం పొట్టు తీసి తినవచ్చు. అప్పుడు పోషకాలు మీ శరీరానికి విరివిగా అందుతాయి. పొట్టు తీసిన బాదం పొట్టు ఉన్న బాదం కంటే రుచిగా ఉండకపోయినా ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ బాదం పప్పు గుండె సంబంధిత సమస్యల్ని దూరం చేస్తుంది. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, జింకు, ఫాస్పరస్, సోడియం, ఐరన్ వంటి ఖనిజ లవణాలు విరివిగా ఉన్నాయి. బాదం పప్పులో విటమిన్-ఈ, ఒమెగా3 అమైనో ఆమ్లాలు, ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది. అంతేకాకుండా గర్భీణీలకు కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఇక నానబెట్టిన బాదం తింటే పీచు పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా మలబద్దకం కూడా దూరం అవుతుంది. అందుకే బాదంలను మాములుగా కాకుండా నానబెట్టి తీసుకోవడం ఎంతో ఉత్తమం.