Hair Problem Tips: జుట్టు రాలిపోతుండటాన్ని ఎవరూ తట్టుకోలేరు. ఇక అమ్మాయిలైతే చెప్పాల్సిన అవసరం లేదు. కేశాలు వారి అందాన్ని రెట్టింపు చేస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చాలామంది జుట్టు మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. మనలో చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం సాధారణమే. కానీ చాలా మంది జుట్టు రాలిపోతుంటే విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది. అయితే మీ జుట్టు బలంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు బాగా గుర్తుపెట్టుకోండి.
రోజుకు రెండు సార్లు జుట్టు దువ్వడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. జుట్టు ఒత్తుగా, మృదువుగా వుండాలంటే.. జుట్టును రోజుకు రెండుసార్లు, ఉదయం ఒకసారి, పడుకునే ముందు ఒకసారి దువ్వాలని వైద్యులు అంటున్నారు. రోజుకు రెండు సార్లు దువ్వెనతో తల దువ్వడం ద్వారా మృత చర్మ కణాలు తొలగిపోతాయి. దువ్వితే తలమీద రక్తప్రసరణ బాగా అందుతుంది. జుట్టు మృదువుగా, మెరుపుగా అవుతుందని మరీ ఎక్కువగా దువ్వుతారు. దీనివల్ల సహజసిద్ధ తైలంలో మాడు భాగంలో అన్ని వెంట్రుకలకు అందుతాయి. కానీ, ఎనిమిది తొమ్మిది సార్ల కంటే ఎక్కువ దువ్వక్కరలేదు. ఎక్కువ సార్లు దువ్వడం వల్ల జుట్టు లాగినట్లుగా అవుతుంది.
Diseases Attack India: భారత్‌పై డేంజరస్ వ్యాధుల దండయాత్ర.. తస్మాత్ జాగ్రత్త
రోజుకు రెండు సార్లు జుట్టును దువ్వడం వల్ల పెరగడం జరుగుతుంది. అలాగే జుట్టు ఆరోగ్యంగా వుంటుంది. అలాగే మెదడు పనితీరు కూడా మెరుగు పడుతుంది. మాడుపై గల కణాలను దువ్వెన ద్వారా దువ్వడంతో యాక్టివేట్ చేయవచ్చు. తద్వారా రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. అలాగే ప్రతీరోజూ నూనెను వాడటం మరిచిపోవద్దు. సహజమైన, ఆరోగ్యకరమైన నూనెలను వెంట్రుకల మూలాల నుండి చివర్ల వరకు పట్టిస్తే తలనొప్పిని దూరం చేసుకోవచ్చు. తద్వారా జుట్టు నిగారింపును సంతరించుకుంటుందని వైద్యులు సూచిస్తున్నారు. చాలా రకాల జుట్టు సమస్యలకు ఆయిల్ పెట్టడమే పరిష్కారం. తలస్నానానికి ముందు నూనె పెట్టడం వలన మీ జుట్టు చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. ఇందుకు కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆలివ్ ఆయిల్ బాగా ఉపకరిస్తాయి. అయితే, రోజంతా అలా జిడ్డు తలతో ఉండటం బాగుండదు, జుట్టుకు కూడా మంచిది కాదు.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.