Mahanandi: మహానంది క్షేత్రంలో మళ్లీ ఎలుగుబంటి కలకలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahanandi: గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పుణ్యక్షేత్రాలతో పాటు అనేక గ్రామాల్లో వన్య మృగాల సంచారం అధికమైంది. తిరుపతి, శ్రీశైలం సహా అనేక పుణ్యక్షేత్రాల్లో క్రూరమృగాల సంచారం ఎక్కువైపోయింది. దైవ దర్శనానికి వెళ్లే భక్తులపై దాడులకు పాల్పడుతుండడంతో భక్తులు భయాందోళన మధ్య క్షేత్రాలకు వెళ్తున్నారు. ఇటీవల తిరుమలలో మృగాల భయం ఎక్కువ కావడంతో టీటీడీ, అటవీ అధికారులు చిరుతలు, ఎలుగుబంట్లను పట్టుకునేందుకు 300 నిఘా కెమెరాలు, బోనులు ఏర్పాటు చేసి జంతువులను పట్టుకునే పనిలో పడ్డారు. ఇదిలా ఉండగా ఇప్పడు నంద్యాలలోని మహానంది క్షేత్రంలో ఎలుగుబంటి హల్‌చల్ చేసింది.
Also Read: Govt Hospital: జగిత్వాలలో ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యం.. పేషెంట్ ను నేలపై పడుకోబెట్టిన సిబ్బంది..
Also Read
- Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
- Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణక్షేత్రమైన మహానంది క్షేత్రంలో మళ్లీ ఎలుగుబంటి కలకలం సృష్టించింది. అటవీ ఆహారాన్ని వదిలి, వండిన వంటకాలకు ఎలుగుబంటి రుచి మరిగింది. హోటల్ నిర్వాహకులు పారేసిన ఇడ్లీ, వడ, పూరి, అన్నాన్ని ఎలుగుబంటి తింటోంది. వారం నుంచి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆ ఎలుగుబంటి చక్కర్లు కొడుతోంది. హోటల్ నిర్వాహకులు, యాత్రికులు తినుబండాలను అడవి ప్రాంతంలో వేయవద్దని మైకుల్లో ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హోటల్ యజమానులకు ఈవో చంద్రశేఖర్ రెడ్డి నోటీసులను జారీ చేశారు. ఆహార పదార్థాలను రోడ్లపై, బయట వేయవద్దని ఆదేశాలు జారీ చేశారు.
మహానంది క్షేత్రం పరిసర ప్రాంతాల్లో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా ఆలయ పరిసరాల్లో ఎలుగుబంటి సంచరిస్తోందని, సత్రాల వద్ద పడేసిన భోజనం కోసం అది వస్తోందని ఆలయ అధికారులు వెల్లడించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చినట్టు చెప్పారు. ఎలుగుబంటి సంచారంతో భక్తులు, స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. కారణమేదైనా పుణ్యక్షేత్రాలో క్రూరమృగాల సంచారం ఇటు భక్తులను, అటు స్ధానికులను ఆందోళనుకు గురిచేస్తున్నాయి.
తాజావార్తలు
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
-
Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
-
Sharmistha Mukherjee: “రాజకీయం పార్ట్ టైమ్ కాదు”.. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
-
Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!