గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పుణ్యక్షేత్రాలతో పాటు అనేక గ్రామాల్లో వన్య మృగాల సంచారం అధికమైంది. తిరుపతి, శ్రీశైలం సహా అనేక పుణ్యక్షేత్రాల్లో క్రూరమృగాల సంచారం ఎక్కువైపోయింది. దైవ దర్శనానికి వెళ్లే భక్తులపై దాడులకు పాల్పడుతుండడంతో భక్తులు భయాందోళన మధ్య క్షేత్రాలకు వెళ్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో మరోసారి ఎలుగుబంట్లు హల్‌చల్ చేశాయి. పట్టపగలు గ్రామాల్లో సంచరిస్తూ ఎలుగుబంట్లు స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. వజ్రపుకొత్తూరు మండలం చినవంకలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లోకి మూడు ఎలుగుబంట్లు చొరబడ్డాయి.