Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srinivasa Mangapuram ఘట్టమనేని కుటుంబం నుంచి టాలీవుడ్‌కు మరో కొత్త హీరో పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, హీరో మహేష్ బాబు సోదరుడు.. దివంగత రమేష్ బాబు కుమారుడు, జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ‘శ్రీనివాసమంగాపురం’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడాని హీరోయిన్గా టాలీవుడ్‌కు పరిచయమవుతోంది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ విడుదల వాయిదా పడినట్లు ఇప్పుడు సినీ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రానికి ‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ చిత్రాల ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో, చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్‌పై మిథునమ్ కిరణ్, సి.అశ్విని దత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
నేషనల్ అవార్డ్ విన్నర్ జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. మహేష్ బాబు వారసుడి ఎంట్రీ కావడం, అజయ్ భూపతి మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండటంతో ఘట్టమనేని అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిజానికి ఈ సినిమాను జూలై 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ జూలై రేస్ నుంచి తప్పుకుంది. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా కొంత మేర బ్యాలెన్స్ ఉండటం, అలాగే ప్రమోషన్స్ కోసం మరికొంత సమయం కేటాయించాలనే ఉద్దేశంతోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. అవుట్‌పుట్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని డైరెక్టర్ భావిస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా కొత్త విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
-
Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
-
Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..