CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలి
- పిల్లల పెంపకంలో తండ్రి బాధ్యత తీసుకోవాలి
- పరిస్థితులు మారాయి..ఇప్పుడు సంతానం భారం కాదు..సంపద
- చిన్నారులకు పోలియో చుక్కల కార్యక్రమంలో తల్లిదండ్రులతో సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu : జాతీయ ఇమ్యునైజేషన్ డే (National Immunization Day) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆయన స్వయంగా పలువురు చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేశారు. అనంతరం అక్కడికి వచ్చిన చిన్నారులను ఎత్తుకుని ఆప్యాయంగా ఆడించిన చంద్రబాబు.. వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో ముఖాముఖి మాట్లాడారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి, వ్యాక్సినేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల టీకాలను తల్లిదండ్రులు నిర్ణీత సమయానికి తప్పనిసరిగా వేయించాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు.
సంతానం భారం కాదు.. సంపద
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తల్లిదండ్రులతో ముఖాముఖి మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ప్రస్తుత రోజుల్లో పిల్లల పెంపకం భారంగా భావిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పరిస్థితులు కూడా మారాయని.. ఇప్పుడు సంతానాన్ని ఒక సమస్యగానో, భారంగానో చూసే విధానం పోవాలని ఆకాంక్షించారు. “సంతానం అంటే భారం కాదు.. సమాజానికి అదొక పెద్ద సంపద” అనే పరిస్థితి ఇప్పుడు వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. వృద్ధాప్య జనాభా పెరుగుతున్న తరుణంలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. ప్రతి కుటుంబంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉండేలా ప్రభుత్వ పరంగా కూడా తాము ప్రోత్సహిస్తున్నామని, ఈ విషయంలో ముందుగా తల్లిదండ్రులకు అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
Also Read
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
- AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
- AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. 4 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
పిల్లల పెంపకంలో తండ్రులూ బాధ్యత తీసుకోవాలి
ప్రస్తుత తరుణంలో ఉద్యోగానికి, ఉపాధికి వెళుతున్న మహిళలు పిల్లల పెంపకాన్ని ఎలా సమన్వయం చేసుకుంటున్నారనే విషయాన్ని సీఎం అడిగి తెలుసుకున్నారు. పిల్లలను కని, పెంచడం , వారి అలనాపాలనా చూసుకోవడం అనేది కేవలం తల్లికి మాత్రమే పరిమితం చేయకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇంట్లో భర్త , మగవాళ్లు కూడా పిల్లల పెంపకంలో సమానంగా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో ఉన్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చాలా బలమైనదని.. నాడు ఇంట్లో అమ్మమ్మలు, తాతయ్యలు, ఇతర కుటుంబ సభ్యులు ఉండటం వల్ల పిల్లల పెంపకంలో అందరూ భాగస్వాములు అయ్యేవారని గుర్తుచేశారు. పిల్లలను మంచి విలువలతో పెంచడంలో వారు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించేవారని.. నేటి ఆధునిక కాలంలో అటువంటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ తిరిగి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నొక్కి చెప్పారు.
మూడ్రోజుల పాటు పల్స్ పోలియో.. 49.20 లక్షల మంది లక్ష్యం
ఇదిలావుండగా, రాష్ట్రంలో పల్స్ పోలియో కార్యక్రమం అమలుకు చేసిన ఏర్పాట్లను కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. 5 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న సుమారు 49.20 lakhs (49.20 లక్షల) మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడమే లక్ష్యంగా అన్ని జిల్లాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అధికారులు వివరించారు.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!