Koti Deepotsavam 2024 Day 5: ప్రతి సంవత్సరం నిర్వహించిన విధంగానే భక్తి టీవీ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. నవంబర్ 9 నుంచి 25 వరకు వైభవోపేతంగా కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు భక్తి టీవీ, ఎన్టీవీ, వనిత టీవీ సంయుక్తంగా శ్రీకారం చుట్టాయి. ఇల కైలాసంలో జరిగే ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. హైదరాబాద్, పరిసర ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర జిల్లాల…
Koti Deepotsavam 2024 : ‘రచన టెలివిజన్ లిమిటెడ్’ ప్రతీ సంవత్సరం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా ‘కోటి దీపోత్సవం’ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో జరిగే ఈ దీపాల పండగకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి.. దీపాలను వెలిగిస్తుంటారు. ఈ ఏడాది నవంబర్ 9 నుంచి 25 వరకు కోటి దీపోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. కోటి దీపోత్సవం 2024లో ఇప్పటికే నాలుగు రోజులు పూర్తి…
Leopard Roaming In Mahanandi : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో చిరుత గత 22 రోజులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. చిరుత సంచారానికి సంబంధించిన సిసిటీవీ ఫోటేజీలలో కూడా చాలానే మీడియా ద్వారా బయటికి వచ్చాయి. 22 రోజులుగా మహానంది పుణ్యక్షేత్రం చుట్టూ చిరుత చక్కర్లు కొడుతుండడంతో భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే చిరుతను బంధించడానికి అటవీ శాఖ అధికారులు అనేక మార్గాలను చేస్తున్నారు. మహానందిలోని విద్యుత్ సబ్ స్టేషన్, అన్నదాన సత్రం,…
Leopard in Dig : ఈ మధ్యకాలంలో అభయ అరణాలల్లో ఉండాల్సిన క్రూరమృగాలు ప్రజలు ఉండే ప్రాంతంలోకి రావడం కామన్ గా మారిపోయింది. పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, చిరుతలు లాంటి అడవి జంతువులు కొన్నిసార్లు ప్రజలు ఉన్న ప్రాంతాల్లోకి రావడం పరిపాటిగా మారిపోయింది. గత కొన్ని రోజుల నుంచి ఏపీ లోని కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాలలో చిరుతపులలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా నంద్యాల జిల్లాలోని మహానంది గుడి సమీపంలో ఓ చిరుత పులి తిరగడంతో ప్రజలు…
మహానంది క్షేత్రంలో మళ్లీ చిరుత కలకలం రేపింది. క్షేత్రంలోని అన్నదాన సత్రం వద్దకు వచ్చి కుక్కను లాక్కొని వెళ్లింది. చిరుతను చూసి ఆలయ సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు.
ప్రముఖ మహానంది క్షేత్రంలో 6 నుండి 11వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ప్రతిరోజు అభిషేకాలు, విశేష పూజలు, వాహన సేవలు నిర్వహించనున్నారు. 8వ తేదీ రాత్రి 10 గంటలకు లింగోద్భవ కాలంలో మహా రుద్రాభిషేకం చేపట్టనున్నారు.
గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పుణ్యక్షేత్రాలతో పాటు అనేక గ్రామాల్లో వన్య మృగాల సంచారం అధికమైంది. తిరుపతి, శ్రీశైలం సహా అనేక పుణ్యక్షేత్రాల్లో క్రూరమృగాల సంచారం ఎక్కువైపోయింది. దైవ దర్శనానికి వెళ్లే భక్తులపై దాడులకు పాల్పడుతుండడంతో భక్తులు భయాందోళన మధ్య క్షేత్రాలకు వెళ్తున్నారు.