Show Cause Notice: ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల శిక్షణకు డుమ్మా కొట్టిన 71 మంది ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 4,5 తేదీల్లో ఎన్నికల నిర్వహణ పై శిక్షణకు 20 శాఖలకు సంభందించిన 71 మంది గైర్హాజర్ అయ్యారు. దీనిపై సీరియస్ అయిన అధికారులు వారికి నోటీసులు పంపారు. ఎందుకు హాజరు కాలేదో వారందరూ కారణం చెప్పాలని కోరారు. ఎన్నికల శిక్షణకు 20 శాఖలకు సంబంధించన వారిపై సీరియస్ అయ్యారు. ఎన్నికల శిక్షణకు హాజరు కాకపోతే.. కోడ్ నియమాలు ఎలా తెలుస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరుకాలేనందుకు కారణాలు తెలపాలని కోరారు. మరి దీనిపై ఉద్యోగులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Read also: Ashok Galla: డిజిటల్ క్రియేటర్‌కు యువ హీరో అశోక్ గల్లా ఆర్థిక సహాయం!
ఇక తాజాగా నిజామాబాద్ లో ఎన్నికల సన్నాహాల్లో భాగంగా నిర్వహించిన శిక్షణకు గైర్హాజరైన 144 మంది వివిధ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఆ శాఖ ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేశారు. పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహన నేపథ్యంలో మంగళవారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఏర్పాటు చేశారు. ఎన్నికల కోసం విద్యా, ఇంటర్మీడియట్ విద్య, అటవీ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, మైనార్టీ, ఎస్సీ సంక్షేమం, ఐటీఐ తదితర శాఖల అధికారులను నియమించారు.
Read also: Russia-Ukraine war: ఉక్రెయిన్పై రష్యా క్షిపణులతో దాడి.. 8 మంది మృతి
జిల్లా విద్యాశాఖకు చెందిన 84 మంది ఉపాధ్యాయులు, ఇతర విభాగాలకు చెందిన 40 మంది ఉపాధ్యాయులు శిక్షణకు గైర్హాజరయ్యారు. ఈ విషయాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతరావు సీరియస్ అయ్యారు. గైర్హాజరైన వారికి నోటీసులు జారీ చేయాలని ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. దీంతో డీఈవో దుర్గాప్రసాద్ 84 మంది ఉపాధ్యాయులకు, డీఈవో రవికుమార్ ఏడుగురు లెక్చరర్లకు, ఇతర శాఖల ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గురువారంలోగా సమాధానం ఇవ్వాలని, లేకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు.
Adah Sharma: నేను చూడ్డానికే వెళ్లాను.. అందరికీ తప్పకుండా చెబుతా: ఆదా శర్మ