Bank of Baroda: నిరుద్యోగ యువతకు బ్యాంక్ ఆఫ్ బరోడా శుభవార్త అందించింది. రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెషనల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 518 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపిక ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా జరగనుంది. ఉద్యోగంలో ఎంపికైన వారికి అధిక వేతనం లభించనుంది. ఈ నోటిఫికేషన్‌లో సీనియర్ మేనేజర్, మేనేజర్, ఆఫీసర్, డెవలపర్, క్లౌడ్ ఇంజినీర్, ఏఐ ఇంజినీర్, ఏపీఐ డెవలపర్, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
Read Also: Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ ఫొటోలు మార్ఫింగ్‌పై కేసులు!
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, B.E, B.Tech, M.E, M.Tech, MCA, CA, CFA, MBA వంటి విద్య అర్హతలు అవసరం. అంతేకాదొండోయ్.. కొన్ని పోస్టులకు పని అనుభవం కూడా అవసరం. పోస్టును అనుసరించి 22 నుండి 43 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఇక జీతం విషయానికి వస్తే.. పోస్టును బట్టి నెలకు జీతం ఉంటుంది. ఇందులో పోస్ట్ గ్రేడ్- జేఎంజీ/ఎస్-1కు రూ.48,480, ఎంఎంజీ/ఎస్-2కు రూ.64,820, ఎంఎంజీ/ఎస్-3కు రూ.85,920, ఎస్‌ఎంజీ/ఎస్-4కు రూ.1,02,300 వేతనం లభించనుంది.
Read Also: Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా ముగింపు రోజున ఆకాశంలో కనివిందు కానున్న అద్భుతం
ఎంపిక విధానం విషయానికి వస్తే.. ఇక్కడ ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూతో ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. జనరల్, ఓబీసీ, EWS వారికీ దరఖాస్తు ఫీజు రూ. 600 ఉండగా.. ఎస్సి, ఎస్టి, వికలాంగులకు (PWD) రూ.100 చెల్లించాలి. మార్చి 11, 2025 దరఖాస్తుకు చివరి తేదీ. దరఖాస్తు ఇంకా మరిన్ని పూర్తి వివరాల కోసం https://www.bankofbaroda.in/career వెబ్‌సైట్ ను సందర్శించండి. ఆసక్తి గల అభ్యర్థులు తద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి.