పెట్టుబడి పెట్టడానికి అనేక మార్గాలున్నాయి. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ ఇలా విధాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ ఎక్కువ. లాభాల సంగతి దేవుడెరుగు ఉన్నది ఊడ్చుకుపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎలాంటి రిస్క్ లేకుండా బ్యాంకుల్లో, పోస్టాఫీస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా పోస్టాఫీస్, బ్యాంక్ ఎఫ్డీలల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను అందుకోవచ్చంటున్నారు. మరి ఈ పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ FDలలో దేంట్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలను అందుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
Also Read:Balakrishna Wife Vasundhara Devi: బాలయ్య ఎంత బిజీగా ఉన్నా ఆయన మనసు హిందూపురంపైనే..
బ్యాంక్ FD పై వడ్డీ ఎంత?
దేశంలోని ప్రతి చిన్న, పెద్ద బ్యాంకులు ప్రస్తుతం 7 నుంచి 8 శాతం వడ్డీరేటును అందిస్తున్నాయి. మీరు 3 నుంచి 5 సంవత్సరాల పాటు ఎఫ్డీ తీసుకున్నప్పుడు మాత్రమే ఈ రాబడి లభిస్తుంది. అంటే మీరు చాలా కాలం పాటు ఎఫ్డీ తీసుకుంటేనే బ్యాంక్ FD పై మంచి రాబడిని పొందుతారు.
Also Read:Drone Missile: డ్రోన్ నుంచి మిస్సైల్ ప్రయోగం.. సత్తా చాటిన భారత్..
పోస్టాఫీసులో ఎంత రిటర్న్ వస్తుంది?
పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్, సుకన్య సమృద్ధి యోజన పథకాలలో అత్యధిక రాబడి లభిస్తున్నప్పటికీ, అందరూ ఇందులో పెట్టుబడి పెట్టలేరు. 60 ఏళ్లు నిండిన వారు మాత్రమే పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ పథకంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే సుకన్య పథకంలో బాలికలు మాత్రమే పెట్టుబడి పెట్టగలరు. ఇది ప్రత్యేకంగా బాలికల కోసం ప్రారంభించబడింది.
Also Read:Drone Missile: డ్రోన్ నుంచి మిస్సైల్ ప్రయోగం.. సత్తా చాటిన భారత్..
పోస్టాఫీసులో పెట్టుబడికి ఎటువంటి పరిమితి లేని అనేక పథకాలు ఉన్నాయి. పోస్టాఫీస్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ పథకం ప్రస్తుతం 7.7 శాతం రాబడిని ఇస్తోంది. మీరు ఈ పథకాన్ని రూ. 1000 మొత్తంతో ప్రారంభించవచ్చు. ఇందులో గరిష్ట పరిమితి లేదు.
Also Read:Mumbai: ఓ మాతృమూర్తి నిర్లక్ష్యం.. 12వ అంతస్తు నుంచి జారి పడి చిన్నారి మృతి
మీకు ఏది మంచిదో తెలుసా?
మీకు ఏది మంచిది అనేది మీరు ఏ బ్యాంకు FDలో పెట్టుబడి పెడుతున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. పెట్టుబడి పెట్టే ముందు, ఆ బ్యాంకు FD మీకు ఎంత రాబడిని ఇస్తుందో ఖచ్చితంగా తనిఖీ చేయండి. బ్యాంకు FD మీకు 7.5 శాతం కంటే తక్కువ రాబడిని ఇస్తుంటే, మీరు పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ లేదా కిసాన్ వికాస్ పత్ర పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. కిసాన్ వికాస్ పత్ర పథకంలో మీరు 7.5 శాతం వరకు వడ్డీని పొందుతారు.