Khaleda Zia: భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా చాలా రోజుల మౌనం తర్వాత మొదటిసారి మాట్లాడారు. దేశంలో తన పార్టీ అధికారాన్ని కోల్పోడానికి అమెరికా, పాకిస్థాన్ కారణం అని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. తాజాగా బంగ్లాదేశ్ రాజకీయాల్లోకి ఆ దేశ మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా ఎంట్రీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో ఆమె తిరిగి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. 2026 ఫిబ్రవరిలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొంటున్నట్లు ఆమె పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్పి) సోమవారం ప్రకటించింది. ఇంతకీ ఈ ఖలీదా జియా ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Bus Accident in AP: ఏపీలో మరో ఘోర ప్రమాదం.. ట్రావెల్స్ బస్సు బోల్తా..
జియా – షేక్ హసీనా మధ్యే పోటీ..
బంగ్లాదేశ్ రాజకీయాలు చాలా కాలంగా ఖలీదా జియా – షేక్ హసీనా మధ్య శత్రుత్వంతో ఉన్నాయి. దేశంలో వీళ్ల శత్రుత్వాన్ని తరచుగా బేగంల యుద్ధం అని పిలిచే వారు. షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ హత్య తర్వాత 1975లో ఈ శత్రుత్వం ప్రారంభమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన హత్యకు గురైన మూడు నెలల తర్వాత ఖలీదా జియా భర్త దేశ డిప్యూటీ ఆర్మీ చీఫ్ జియావుర్ రెహమాన్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. 1977లో జియార్ అధ్యక్షుడయ్యాడు. 1981లో ఆయన హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత ఖలీదా జియా బిఎన్పికి నాయకత్వం వహించారు. మొదట్లో అనుభవం లేని వ్యక్తిగా ఆమె భావించిన, అనంతరం ఆమె సైనిక పాలకుడు హుస్సేన్ ముహమ్మద్ ఎర్షాద్కు వ్యతిరేకంగా ఉద్యమానికి నాయకత్వం వహించింది. ఆ తరువాత షేక్ హసీనాతో కలిసి 1990లో ఎర్షాద్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రధాన పాత్ర పోషించింది. ఆ తర్వాత ఇద్దరూ దాదాపు 15 సంవత్సరాలు అధికారాన్ని మార్చుకొని పాలించారు.
బంగ్లాదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర..
80 ఏళ్ల ఖలీదా జియా చాలా కాలంగా బంగ్లాదేశ్ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా ఉన్నారు. తాజాగా పార్టీ నాయకురాలు మీర్జా ఫక్రుల్ ఇస్లాం అలంగీర్ మాట్లాడుతూ.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆమె మూడు వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారని వెల్లడించారు. వాస్తవానికి ఖలీదా జియా ఆరోగ్యం బాగాలేదు, ఆమె చాలా సంవత్సరాలు జైలులో గడిపింది. 2018లో ప్రధాన మంత్రి షేక్ హసీనా ప్రభుత్వం ఆమెను అవినీతి కేసులో దోషిగా ప్రకటించి, వైద్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లకుండా అడ్డుకుంది. అయితే ఆగస్టు 2024లో హసీనా ప్రభుత్వం పడిపోయిన, కొద్ది సేపటికే ఖలీదా జియా జైలు నుంచి విడుదలయ్యారు.
మూడుసార్లు ప్రధానమంత్రిగా పనిచేశారు..
ఖలీదా జియా బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా మూడుసార్లు పనిచేశారు. రాబోయే ఎన్నికల్లో ఆమె బిఎన్పి పార్టీ దేశంలో బలమైన పోటీదారుగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఖలీదా కుమారుడు 59 ఏళ్ల తారిఖ్ రెహమాన్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఆయనను బంగ్లాదేశ్లో తారిఖ్ జియా అని పిలుస్తారు. తారిఖ్ 2008 నుంచి బ్రిటన్లో నివసిస్తున్నాడు. దేశంలో రాజకీయ ఒత్తిడి, వేధింపుల నుంచి తప్పించుకోవడానికి తాను దేశం విడిచి వెళ్ళానని తారిఖ్ జియా పేర్కొన్నారు. ఆ పార్టీ నాయకుడు అలంగీర్ కూడా రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పాడు. 2004లో షేక్ హసీనా ర్యాలీపై జరిగిన గ్రెనేడ్ దాడి కేసులో జీవిత ఖైదు నుంచి ఆయన ఇటీవల నిర్దోషిగా విడుదలయ్యారు.
READ ALSO: Indelible Election Ink: ఎన్నికల్లో చెరగని ‘సిరా’ చరిత్ర తెలుసా..!