భైంసా అంటే జోష్.. సీఎం కేసీఆర్ ఏడికి పోయినా బీజేపి తిట్టడం తప్పా ఏం అభివృద్ధి చేశారో చెప్పడంలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ఇవాళ ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఔట్ అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అయితడని బండి సంజయ్ జోష్యం చెప్పారు. కేసీఆర్ పాస్ పోర్టు ల బ్రోకర్ అని ఆయన విమర్శలు గుప్పించారు. కేసీఆర్, కేసీఆర్ కుటుంబం ఏం చేసిందని, ఎన్నికల ముందు కేటీఆర్ కు బండి సంజయ్ అంటే లాగు తడుస్తదన్నారు. నన్ను గెలుకుతే.. నేను ఊరుకోనని, 14 వందల మంది బలి తీసుకున్నాక కాంగ్రెస్ బిల్లు పెట్టిందన్నారు. కేసీఆర్ నటించుడు కాదు. జీవిస్తాడని, తెలంగాణ రావద్దు అని కోరుకున్నాడు కేసీఆర్ అని ఆయన విమర్శించారు.
అంతేకాకుండా.. ‘ఢిల్లీ లో మళ్లీ వచ్చేది మోది ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ గాల్లో వస్తది గాల్లో పోతది. ఆరు స్కీం లు.. అర డజన్ మంది సీఎం లు.. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిస్తే కేసీఆర్ గంపకింద కమ్ముతాడు. కాంగ్రెస్ పార్టీ అధికారం లో వస్తే అప్పులు, అక్రమాలు చేస్తారు. కేసీఆర్ గెలిస్తే కుటుంబ పాలన వస్తది. ముదోల్ ను దత్తత తీసుకుంటా. నేను భైంసా ను …మైసా చేస్తా అనుతుంటే బీ ఆర్ ఎస్, కాంగ్రెస్ రాష్ట్రం మొత్తం భైంసా చేస్తా అంటున్నారు. నేను అల్లాను ఎప్పుడు వ్యతిరేకించలేదు. ముస్లింలకు వ్యతిరేఖం కాదు. నా చేతి కాషాయ జెండా ను పాత బస్తీ తీసుకొని వెళ్ళా. పాత బస్తీకి పోతా అంటే బండి సంజయ్ భార్యను చంపుతా అన్నారు.. నా ఇద్దరు పిల్లను కిడ్నాప్ చేస్తాం అన్నారు. అయినా వెనక్కి తగ్గలేదు.
మేము అభివృద్ధి గురించి మాట్లాడితే సిఎం మతం గురించి మాట్లాడుతున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేది బీఆర్ఎస్. కాంగ్రెస్ వాళ్లకు దొంగ వేషాలు వేస్తున్నారు. ముస్లిం మత పెద్ద లు గమనించండి. కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ పార్టీ కి 80 శాతం ఉన్న హిందూవుల ఓట్లు వద్దా. 12 శాతం ఉన్న వాళ్లు బీహార్ లో 5 సీట్లు గెలుస్తే 80 శాతం ఉన్న హిందూవులు ముదోల్ లో ఎందుకు గెల్వదు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే పాకిస్తాన్ జెండా పట్టుకొని తిరిగిన వారిని కరీంనగర్ లో ఉరికించి కొట్టాము. రజాకార్ల రాజ్యం పోవాలి. నయా నిజాం పాలన పోవాలి. బండి సంజయ్. 3 తేదీన ఇక్కడ (భైంసా లో )విజయోత్సవ సభ జరగాలి. ఎవ్వరికి భయపడవద్దు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎం ఐ ఎం వాళ్ళు అరాచకాలు చేస్తున్నారు. మోడీ రాజ్యం వచ్చాక మత కల్లోలాలు జరగలేదు. ఎన్నికల ముందు కేసీఆర్ ఓవైసీ మామ అల్లుళ్లు. ఎన్నికల తరువాత అన్నదమ్ములు.’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.