Bandi Sanjay : మహిళలు, చిన్నారుల భద్రత కోసం రూ.13,412 కోట్లు ఖర్చు
- మహిళల భద్రత కోసం రూ.13
- 412 కోట్లు ఖర్చు చేస్తోందన్న బండి సంజయ్
- పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు వివరాలు వెల్లడించిన మంత్రి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని మహిళల భద్రత కోసం వివిధ పథకాలు, కార్యక్రమాల కింద రూ.13,412 కోట్లు ఖర్చు చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. మహిళా భద్రతా పథకాల కింద మహిళలు, పిల్లలపై లైంగిక వేధింపుల కేసులను నిర్వహించే పరిశోధకులతోపాటు ప్రాసిక్యూటర్ల సామర్థ్యం పెంపొందించేందుకు శిక్షణ ఇచ్చే నిబంధన ఉందా? ఏయే కార్యక్రమాలు అమలు చేస్తున్నారంటూ ఎంపీ నీరజ్ శేఖర్ అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ బదులిచ్చారు. ప్రధానమంత్రి ఆదేశాల మేరకు హోం మంత్రి ఆధ్వర్యంలో మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఆ వివరాలను సభలో వివరించారు. అవేమిటంటే…
Srisailam Dam: మువ్వన్నెల జెండా రంగుల విద్యుత్ కాంతులతో కళకళలాడుతున్న శ్రీశైలం డామ్!
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఇంటర్ ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం కోసం రూ.3375 కోట్లు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ కోసం రూ.531.24 కోట్లు, స్కీం ఫర్ మోడర్నైజేషన్ ఆఫ్ ఫోరెన్సిక్ కోసం రూ.280 కోట్లు, జైళ్ల ఆధునీకరణ కోసం రూ.950 కోట్లు, రాష్ట్ర సైన్స్ ఫోరెన్సిక్ లాబరేటరీల పటిష్టత కోసం రూ.106.75 కోట్లు, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీలు, ఫోరెన్సిక్ డేటా సెంటర్, 6 సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీల ఆధునీకరణకు రూ.354.25 కోట్లు, సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కోసం రూ.2840 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
Paris Olympics 2024: ఫైనల్కు స్పప్నిల్ కుసాలే.. ప్రీక్వార్టర్‌ఫైనల్‌కు పీవీ సింధు..
అట్లాగే శిక్షణ, సామర్ధ్యం పెంపు కోసం రూ.76.5 కోట్లు, పేద ఖైదీల కోసం రూ.60 కోట్లు, మానవ అక్రమ రవాణా నిరోధక (యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్) యూనిట్ కోసం రూ.113.76 కోట్లు, మహిళా హెల్ప్ డెస్కుల కోసం రూ.164.2 కోట్లు, చండీఘడ్ లో డీఎన్ఏ ల్యాబ్ ఏర్పాటు కోసం రూ.42.84 కోట్లు, మహిళలు, చిన్నారులపై సైబర్ నేరాల నియంత్రణ కోసం రూ.224.76 కోట్లు, సెంట్రల్ విక్టిమ్ కాంపోజిషన్ ఫండ్ కోసం రూ.200 కోట్లు, దిల్లీ పోలీస్ స్కీం ఫర్ ప్రొవైడింగ్ ఫెసిలిటీ ఆఫ్ సోషల్ వర్కర్స్ , కౌన్సిలర్స్, న్యూ బిల్డింగ్ ఫర్ విమెన్ సెంట్రిక్ ఫెసిలిటీస్ ఫర్ స్పెషల్ నీడ్స్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ కోసం రూ.38.8 కోట్లు, నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ స్కీం కోసం రూ.2254 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. మొత్తంగా రూ.13,412 కోట్లు మన అమ్మలు, అక్కలు, చెల్లెళ్లు, బిడ్డల కోసం ఖర్చు పెడుతున్నట్లు వివరించారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!