మనుగోడు ప్రచారంలో ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు ఆయా పార్టీల నేతలు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ నేతల మధ్య మునుగోడు ఉప ఎన్నిక వేదికగా మాటల యుద్ధం నడుస్తోంది. నల్లగొండ జిల్లా మునుగోడులో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు అని సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు.
Read Also: Congress President Election: ఖర్గే వర్సెస్ థరూర్.. కాంగ్రెస్ అధ్యక్షుడెవరో తేలేది నేడే..
దమ్ముంటే ఎన్నికల్లో చూసుకుందామని, మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కడిని ఓడించడానికి దండుపాళ్యం ముఠానా? అని ఆయన మండిపడ్డారు. మునుగోడుకు ఇచ్చిన హామీలెందుకు నెరవేర్చలేదో సమాధానం చెప్పే దమ్ముందా? కుర్చీ వేసుకుని పూర్తి చేస్తానన్న చర్లగూడెం, కిష్టరాంపల్లి రిజర్వాయర్ పనులేమైనయ్? అని ఆయన ప్రశ్నించారు. రాజీనామాతో రాజగోపాల్ రెడ్డి సాధించిందేమిటో….ఇవిగో చూడు.. రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజలకు చేసిన అన్యాయం ఏమిటి? సొంత పగ కోసం కార్యకర్తల పోరాటాలను తాకట్టు పెట్టిన కమ్యూనిస్టులు.. టీఆర్ఎస్ కు అమ్ముడుపోయిన కాంగ్రెసోళ్లు.. అంటూ ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
Read Also: Sukesh Gupta: MBS జ్యూయలర్స్ ఎండీ సుఖేష్ గుప్తా అరెస్ట్.. భారీగా బంగారం సీజ్