‘రాజశ్యామల యాగం కాదు… జన వశీకరణ క్షుద్ర పూజలు’’ అని విమర్శలు గుప్పించారు బండి సంజయ్. ఇవాళ బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. సమాజానికి చెడు జరగాలని కోరుకునే వాళ్లకు దైవం తగిన శాస్తి చేయడం తథ్యమని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ పూజలపై బండి సంజయ్ సెటైర్లు అని, నేనెందుకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానంటే.. కేసీఆర్ పాలనలో బాధల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకే పోటీ చేస్తున్నానని ఆయన వెల్లడించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకే పోటీ చేస్తున్నానని, పొరపాటున కరీంనగర్ లో బీఆర్ఎస్ ను గెలిపిస్తే ఎగిరేది మజ్లిస్ జెండానేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే జరిగితే బొట్టు పెట్టుకుని తిరిగే పరిస్థితి కూడా ఉండదన్నారు.
Also Read : Esha Rebba : హీటు పెంచేలా పరువాలతో తెలుగు బ్యూటీ విస్ఫోటనం.. మైండ్ బ్లాక్ చేసే పోజులు..
అంతేకాకుండా.. ‘కరీంనగర్ పాతబస్తీ మాదిరిగా అభివ్రుద్ధికి దూరమయ్యే ప్రమాదం. ఈ విషయం తెలిసే బీఆర్ఎస్ ను ఓడించేందుకు ఆ పార్టీ నేతలే సిద్ధమయ్యారు. మీరు ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్ ప్రజలు తలెత్తుకునే చేసిన చరిత్ర నాది. పూర్తి స్థాయి సమయాన్ని వెచ్చించి ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడగండి. బ్యాలెట్ బాక్సులు తెరిస్తే బీఆర్ఎసోళ్ల బాక్సులు బద్దలు కావాల్సిందే. కరీంనగర్ అసెంబ్లీ ఈస్ట్ జోన్ పోలింగ్ బూత్ అధ్యక్షుల విస్త్రతస్థాయి సమావేశంలో బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశమంతా ‘‘కరీంనగర్’’వైపు చూస్తోందని, పోరాటా తరపున ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేద్దామన్నారు.
Also Read : Mohammed Shami: మహ్మద్ షమీ ఖాతాలో మరో రికార్డ్