Ban on Bursting Crackers: దీపావళి నాడు పటాకులు లేకుండానే ఢిల్లీలోని ప్రజలు పండుగను జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బాణాసంచాను పూర్తిగా నిషేధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ సర్కారు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం బాణాసంచా కొనుగోలు చేసినా, కాల్చినా రూ.200 జరిమానాతో పాటు 6నెలల పాటు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి.
Martial Law: రష్యాలో విలీనమైన ఉక్రెయిన్ ప్రాంతాల్లో మార్షల్ లా.. ప్రకటించిన పుతిన్
ఢిల్లీ సర్కారు ఈ ఏడాది కూడా బాణాసంచా ఉత్పత్తి, నిల్వ, అమ్మకం, పేల్చడాన్ని నిషేధించిందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు జైలు శిక్షలు కూడా ఉంటాయన్నారు. ఢిల్లీలో బాణాసంచా విక్రయం లేదా నిల్వచేస్తే రూ.5వేల జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష విధించవచ్చని ఆయన చెప్పారు. దీపావళికి ముందు పటాకులు పేల్చే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఐపీసీ సెక్షన్ 268 ప్రకారం.. పటాకులు పేల్చేవారిపై రూ. 200 జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష విధించబడుతుందని చెప్పారు.