అక్రమ పటాకుల నిల్వలే హైదరాబాద్‌లో ప్రమాదాలకు కారణమని జిల్లా ఫైర్ అధికారి వెంకన్న వెల్లడించారు. అక్రమ గోదాంలపై నిఘా కొనసాగుతోందన్నారు. వెండర్స్ నకిలీ క్రాకర్స్ అమ్మకాలు జరపొద్దని.. లేబుల్ ఉన్న క్రాకర్స్ మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. నివాసం, సముదాయాల ప్రాంతాల్లో క్రాకర్స్ దుకాణాలకు అనుమత
హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రెయిన్ బజార్‌లోని ఇంట్లో నిల్వ ఉంచిన టపాసులు ఒక్కసారిగా పేలాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా..మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. దీపావళి పండుగ సందర్భంగా ఓ ఇంట్లో పెద్ద మొత్తంలో బాణాసంచాను నిల్వ ఉంచారు.
ఫైర్ క్రాకర్స్ పై అనంతపురం జిల్లాలో తాత్కాలికంగా నిషేధం విధించారు. జిల్లా ఎస్పీ గౌతమిశాలి సిఫారసు మేరకు కలెక్టర్ వినోద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే నెల ఆరో తేదీ వరకు టపాసుల తయారీ, కొనుగోలు, అమ్మకాలు, రవాణా వంటి వాటిపై కలెక్టర్ నిషేధం విధించారు.
రాజస్థాన్ కు చెందిన అమిత్ శర్మ అనే యూట్యూబర్ తన ఛానెల్‌లో వివిధ రకాల వీడియోలను చేయడంలో చాలా ఫేమస్ అయ్యాడు. తాజాగా అలాంటి వీడియోనే రికార్డ్ చేశాడు, ఇది చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అతను చేసిన పని అందిరినీ విస్తుపోయేలా, మైండ్ బ్లాంక్ అవుతుంది. అమిత్ శర్మ తన కారును ఏకంగా లక్ష టపాసులతో అలంకరించాడు.
ఢిల్లీ సర్కారు తీసుకున్న బాణాసంచా నిషేధం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను అత్యవసరం విచారించాలన్న డిమాండ్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది.
దీపావళి నాడు పటాకులు లేకుండానే ఢిల్లీలోని ప్రజలు పండుగను జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బాణాసంచాను పూర్తిగా నిషేధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.