Site icon NTV Telugu

Balochistan: పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ.. క్వెట్టాను స్వాధీనం చేసున్న బలూచిస్థాన్‌.. పాక్ ఆర్మీ పరార్..

Balochistan

Balochistan

పాకిస్థాన్, భారత్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇస్లామాబాద్, రావల్పిండితో పాటు పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో భారత్ దాడులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో బలూకిస్థాన్ నుంచి ఓ వార్త వెలువడుతోంది. పాకిస్థాన్ సైన్యాన్ని బలూచిస్తాన్ నుంచి తరిమికొట్టామని, క్వెట్టాను తమ ఆధీనంలోకి తీసుకున్నామని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

READ MORE: India-Pakistan War: పాకిస్థాన్ ప్రధాని ఇంటి సమీపంలో పేలుళ్లు.. షరీఫ్‌ను తరలించిన పాక్ సైన్యం..

తాజాగా భారత్‌లోని పలు నగరాలపై పాకిస్థాన్ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడులను భారత్ తిప్పికొట్టింది. ఇటు భారత్‌తో పాక్ సైనికులు తలపడుతున్న నేపథ్యంలో బలూచిస్థాన్‌లోని క్వెట్టాలో బలూచ్ యోధులు రంగంలో దిగారు. క్వెట్టాలోని పాకిస్థాన్ దళాల ఫ్రాంటియర్ కార్ప్స్ ప్రధాన కార్యాలయంపై బలూచిస్థాన్ యోధులు దాడి చేశారు. తాజా నివేదికల ప్రకారం.. బలూచి తిరుగుబాటుదారులు క్వెట్టాను తమ ఆధీనంలోకి తీసుకున్నారని, పాకిస్థాన్ సైన్యాన్ని అక్కడ నుంచి తరిమేశారని తెలుస్తోంది.

READ MORE: India-Pakistan War: యుద్ధ బరిలోకి INS విక్రాంత్.. కరాచీ నౌకాశ్రయంలో విధ్వంసం?

క్వెట్టా నగరం జంగ్లే బాగ్‌లోని కాంబ్రానీ రోడ్డు వద్ద ఉన్న పాకిస్థాన్ దళాల కెప్టెన్ సఫర్ ఖాన్ చెక్ పోస్ట్‌ను బలూచి యోధులు లక్ష్యంగా చేసుకున్నారు. సమీపంలోని ఆరు ప్రాంతాల్లో… ఒకేసారి పేలుళ్లు జరిపింది బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ. జమరాన్‌ కట్గాన్ ప్రాంతంలోని పాకిస్థాన్ ఆక్రమణ దళాల చెక్‌పాయింట్‌పై బీఎల్‌ఏ యోధులు ఆటోమేటిక్ ఆయుధాలతో దాడి చేశారు. లాంచర్‌ను ఉపయోగించి బహుళ గ్రెనేడ్‌లను కూడా ప్రయోగించారు. వారి లక్ష్యాలను విజయవంతంగా ఛేదించారు. పాక్‌లోని చమురు క్షేత్రాలపై బలూచీల దాడులు చేసింది. దీంతో చాలా మంది పాక్ సైనికులు అలాగే సాధారణ ప్రజలు కూడా మరణించినట్లు తెలుస్తోంది. ఈ దాడుల అనంతరం పాకిస్థాన్ సైన్యం క్వెట్టా నుంచి పారిపోయింది. కాగా..పాక్‌పై భారత్ దాడులను బలూచీ రేడియో హైలెట్ చేస్తోంది. భారత్‌కు మద్దతు ఇస్తోంది.

Exit mobile version